దేశం మొత్తం దీపావళి పండుగని ఎంతో సంతోషంగా సెలబ్రట్ చేసుకున్నారు. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా బాణాసంచా కాల్చి దీపావళిని సంతోషంగా జరుపుకున్నారు.ఇక సోషల్ మీడియా ద్వారా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. మరి కొందరు ఒకే చోట చేరి ఈ పండుగని సంతోషంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్ వారి కుటుంబ సభ్యులతో కలసి దీపావళి సెలెబ్రేషన్స్ జరుపుకుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్, చరణ్, మహేష్ తరచుగా పార్టీలలో చిల్ కావడం మనం చూస్తూనే ఉంటాం.
పలు సందర్భాలలో ఈ ముగ్గురు కనిపించి ఫ్యాన్స్‌కి కూడా మంచి కిక్ ఇస్తుంటారు. అయితే దీవాళి సందర్భంగా వీరు ముగ్గురికి తోడుగా వెంకీ కూడా జాయిన్ అయ్యారు. వెంకటేష్ ఇండస్ట్రీలో చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరితో చాలా సరదాగా ఉంటారు. మహేష్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రంలో నటించారు వెంకటేష్. అప్పటి నుండిసినిమాలకు అతీతంగా వీరి ఫ్రెండ్ షిప్ కొనసాగుతోంది. ఆ మధ్యన వెంకటేష్ కుమార్తె నిశ్చితార్థంలో కూడా మహేష్, వెంకీ కలిసి సందడి చేయడం మనం చూసాం.
అయితే ఇప్పుడు నలుగురు టాప్ స్టార్స్ దీపావళి పండుగని కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత రాత్రి జరిగిన దీపావళి పార్టీకి సంబందించిన ఫోటోలని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో ఎన్టీఆర్, వెంకీ జంటగా.. మహేష్, చరణ్ జంటగా ఇచ్చిన ఫోజు అదిరిపోయింది. ఇతర ఫొటోల్లో నమ్రత, ఉపాసన, లక్ష్మి ప్రణతి లతో పాటు అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహని కూడా చూడొచ్చు. ఇక చిరంజీవి, వెంకటేష్, నాగార్జున కూడా సందడి చేశారు. అల్లు అర్జున్.. వెంకీతో కలిసి దిగిన పిక్ వైరల్ అవుతుంది. మరోవైపు మెగా కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి అయిన తర్వాత మొదటి సారి దీపావళి పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు. కొత్త కోడలి సమక్షంలో దివాళీ మెగా బ్రదర్ ఇంట్లో కొత్త సందడి తీసుకొచ్చింది.