మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాని ఎక్కడా తగ్గకుండా నిర్మిస్తున్నారు. అయితే ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఇంతవరకు పూర్తైంది లేదు. గత ఏడాది మూవీ రిలీజ్ కావల్సి ఉన్నా ఎందుకో అది జరగలేదు. కనీసం మూవీ అప్‌డేట్స్ ఏమైన ఇస్తారా అంటే అది లేదు.ఈ క్రమంలో మెగా అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు, మూవీకి సంబంధించి ఏమైన అప్‌డేట్స్ ఇవ్వడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. మే నెల వరకు ఈ మూవీ చిత్రీకరణ పూర్తి కానుందని, మూవీని సెప్టెంబర్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నట్టు సమాచారం. కాలేజ్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్లు షూట్ చేస్తున్నారట. దాదాపు మే వరకు చిత్రీకరణ పూర్తి చేసి ఆ తర్వాతే అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్,ట్రైలర్ విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది.
ఇందులో తెలుగు హీరోయిన్ అంజలి ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో చివరిగా ప్రేక్షకులని పలకరించిన రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ చిత్రంతో మరో మంచి హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడని అంటున్నారు. ఇక రామ్ చరణ్ 16వ సినిమా కూడా ఇటీవలే గ్రాండ్‌గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. చిరంజీవి, శంకర్ అతిథులుగా ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు. బుచ్చిబాబు దర్శకత్వంలో వెరైటీ కాన్సెప్ట్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. గేమ్ ఛేంజర్ పూర్తైన తర్వాత ఆర్సీ 16 మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.