చికెన్ ఫ్రై ఇలా ట్రై చేయండి.. రుచిగా ఉండ‌డమే కాదు.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..

సండే వ‌చ్చిందంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులకు పండుగే. చికెన్, మ‌ట‌న్‌, ఫిష్ ఏదో ఒక‌టి తినేస్తుంటారు. చాలా మంది చికెన్‌ను ఇష్ట‌ప‌డుతుంటారు.

  • Publish Date - February 25, 2024 / 06:42 AM IST

సండే వ‌చ్చిందంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులకు పండుగే. చికెన్, మ‌ట‌న్‌, ఫిష్ ఏదో ఒక‌టి లాగించేస్తూ ఉంటారు. చాలా మంది చికెన్‌ను ఇష్ట‌ప‌డుతుంటారు. అదే సమయంలో ఎప్పుడూ అదే చికెనా? అనే ప్రశ్న కూడా వస్తుంటుంది. అయితే చికెన్‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తుంటారు. చికెన్ క‌ర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ రోస్ట్, చికెన్ 65, చిల్లీ చికెన్ వంటి వెరైటీల‌ను త‌యారు చేస్తుంటారు. అయితే చికెన్‌తో సింపుల్‌గా చేసుకోగ‌ద‌గిన వంట‌కాల్లో చికెన్ ఫ్రై ఒక‌టి. సుల‌భంగా, త్వ‌ర‌గా అయ్యే వంట‌కం ఇది. చికెన్ ఫ్రై ఇలా చేస్తే రుచిగా ఉంటుంది. నేరుగా తిన‌డానికి, సైడ్ డిష్‌గా తిన‌డానికి చాలా చ‌క్క‌గా ఉంటుంది. మ‌రి రుచిగా చికెన్ ఫ్రైను ఎలా త‌యారు చేయాలో చూద్దాం.

చికెన్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర కిలో, ఉల్లిపాయ‌లు -2, ప‌చ్చిమిర్చి -2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – త‌గినంత‌, నూనె – 4 టేబుల్ స్పూన్స్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, గ‌రం మసాలా – అర టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. లా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

చికెన్ ఫ్రై త‌యారీ విధానం..

చికెన్‌ను ముందుగా నీట్‌గా క‌డ‌గాలి. ఆ త‌ర్వాత స్టౌ వెలిగించి.. పాత్ర‌లో నూనె వేసి వేడి చేయాలి. ఇక త‌రిగిన ఉల్లిపాయ‌లు, క‌రివేపాకును నూనెలో వేయాలి. ఒక‌ట్రెండు నిమిషాల త‌ర్వాత పెరుగుతో క‌లిపిన చికెన్‌ను నూనెలో వేసి కాసేపు వేయించాలి. ఆ త‌ర్వాత త‌రిగిన ప‌చ్చిమిర్చి వేసి.. 2 నిమిషాల పాటు మూత పెట్టాలి. చికెన్ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. చికెన్ పూర్తిగా వేగిన త‌రువాత కొత్తిమీర త‌ప్ప మిగిలిన మ‌సాలా పొడులు వేసి బాగా క‌ల‌పాలి. దీనిని మ‌రో 2 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై త‌యారవుతుంది. ప‌ప్పు, సాంబార్, ర‌సం వంటి వాటితో తింటే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Latest News