Site icon vidhaatha

శుక్ర‌వారం ఉప్పు కొంటే.. అప్పులు ప‌రార్..! మ‌రి ఉప్పుతో దీపం పెట్టొచ్చా..?

మ‌నం నిత్యం ఉప‌యోగించే ఉప్పుకు గొప్ప శ‌క్తి ఉంది. వంట‌కాల్లోనే కాకుండా ముఖ్యంగా దృష్టి దోషాల‌ను తొల‌గించే శ‌క్తి రాళ్ల ఉప్పుకు ఉంద‌ని మ‌న పెద్ద‌లు విశ్వ‌సిస్తారు. పిల్ల‌లు నిరంత‌రం ఏడుస్తుంటే, ఆహారం తిన‌క‌పోయినా, అనారోగ్యానికి గురైనా ఉప్పుతో దిష్టి తీస్తుంటారు. అలా దిష్టి తీస్తామో లేదో పిల్ల‌లు ఏడుపు మానేసి ఆడుకుంటారు. అంత గొప్ప శ‌క్తి ఉప్పుకు ఉంది. అంతేకాకుండా ల‌క్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ప్రీతి. కాబ‌ట్టి శుక్ర‌వారం ఉప్పు కొంటే.. అప్పులు మాయ‌మ‌వుతాయ‌ని పండితులు చెబుతున్నారు. అలాగే ల‌క్ష్మీదేవికి ఉప్పుతో దీపం పెడితే కూడా ఆ దేవత అనుగ్ర‌హం మ‌న‌పై ఉంటుంద‌ని న‌మ్మ‌కం.

సంపాద‌న‌లో తొలి ఖ‌ర్చు ఉప్పుపైనే పెట్టాలి..

ప్ర‌తి ఒక్క‌రూ డ‌బ్బు కోసం క‌ష్ట‌ప‌డుతుంటారు. అయితే డ‌బ్బు రాగానే తొలి ఖ‌ర్చు ఉప్పుపైనే పెట్టాలి. ఉప్పు కొన్నాక‌నే మిగ‌తా వాటికి డ‌బ్బులు వెచ్చించాలి. ఇక ఆ ఉప్పును శుక్ర‌వారం కొంటే ఇంకా ఎంతో మంచిది. ఎందుకంటే ల‌క్ష్మీదేవికి ఉప్పు ఎంతో ప్రీతిపాత్ర‌మైన‌ది. అప్పులు కూడా ఉండ‌వు. దారిద్య్రం కూడా తొల‌గిపోతోంది. మంగ‌ళ‌వారం, శ‌నివారం ఉప్పు కొన‌కూడ‌దు. ఆ రోజుల్లో ఉప్పు కొంటే ఆర్థిక క‌ష్టాలు త‌ప్ప‌వు.

ఉప్పు చేతులు మారితే అంతే..

మ‌రి ముఖ్యంగా ఉప్పు చేతులు మార‌కూడ‌ద‌ని పండితులు హెచ్చ‌రిస్తున్నారు. అంటే ఒక‌రి చేతి నుంచి మ‌రొక‌రు ఉప్పును అందుకోకూడ‌దు. ఇలా చేతుల మీదుగా ఉప్పు అందుకుంటే ఆ ఇంట్లో క‌ల‌హాలు వ‌స్తాయి. ఉప్పును జాడీలో ఉంచితే వ‌ద్ద‌న్నా డ‌బ్బు మ‌న ఇంట్లో వాలిపోతుంది. ఉప్పును భ‌ద్ర‌ప‌రిచే జాడీలో ఒక రూపాయి వేసి ఉంచాలి. ఈ సూచనలు పాటించి ప్రతి శుక్రవారం రాళ్ల ఉప్పు పరిహారాలు చేసుకొని అందరు ఆనందంగా ఐశ్వర్యంగా ఉందాం.

ఉప్పుతో దీపార‌ధాన‌..

ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసే ప్రమిద కింద రాళ్ల ఉప్పును ఉంచి దానిపై ప్రమిద పెట్టాలి. అందులో ఆవు నేతిని పోసి దీపం వెలిగించాలి. ఆ దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి అష్టోత్తర శత నామాలతో పూజిస్తే ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఆ ఇంట్లో నివసించే వారు ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో వర్ధిల్లుతారు.

స్నానం నీటిలో ఉప్పు వేసుకుంటే..

శుక్ర‌వారం ఉద‌యం లేవ‌గానే ప్ర‌తి మ‌హిళ కూడా స్నానం నీటిలో ఒక స్పూన్ రాళ్ల ఉప్పు వేసుకోని స్నాన‌మాచ‌రిస్తే ఎంతో మంచిది. ఎలాంటి దృష్టి దోషాలు ఉన్న తొలగిపోతాయి. అలాగే ఉప్పు నీటితో ఇంటిని తుడిస్తే నెగిటివ్ ఎన‌ర్జీ మాయ‌మైపోతుంది. కాబ‌ట్టి ఉప్పును ఎంతో దైవ‌భ‌క్తితో చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. 

Exit mobile version