Site icon vidhaatha

సీక్రెట్ ప్రేమాయ‌ణం న‌డిపిన జ‌బ‌ర్ధ‌స్త్ న‌రేష్‌… ఇన్నాళ్ల‌కి బ‌య‌ట‌పెట్టాడుగా..!

జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాపుల‌ర్ అయిన క‌మెడీయ‌న్స్ లో న‌రేష్ ఒక‌రు.చూడ‌డానికి రెండ‌డుగులే ఉన్నా ఆయ‌న నోటి నుండి వ‌చ్చే డైలాగులు, పంచులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్ర‌స్తుతం సెల‌బ్రిటీగా న‌రేష్ చిన్న‌ప్పుడు చాలా క‌ష్టాలు చ‌విచూశాడు. చదువును మధ్యలోనే ఆపేసి నటనపై ఉన్న ఆసక్తితో జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి… ఒక ఆర్టిస్ట్ గా మొదలుపెట్టిన అత‌ని ప్ర‌యాణం టీం లీడర్ స్థాయి వరకు వెళ్లింది. చిన్నపిల్లడిలా కనిపించే నరేష్ వయసు పాతిక సంవ‌త్సరాల‌పైనే ఉంటుంది.. హైట్ తక్కువగా ఉండడంతో చిన్న పిల్లాడిలాగా కనిపిస్తాడు. అయితే నరేష్ కి వివాహం జరిగిందంటూ సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు రాగా, వాటిని కొంద‌రు కొట్టిపారేసారు.

అయితే నరేష్ 2017లో తిరుపతాంబిక అనే అమ్మాయిని వివాహం చేసుకోగా, పెళ్లైన కొన్ని రోజుల‌కి ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ట‌. తన భార్య చనిపోయినప్పటి నుంచి నరేష్ సింగిల్ గానే ఉంటున్నాడు. అయితే ప‌లు షోల‌లో న‌రేష్ పెళ్లికి సెట్‌ కాడు, ప్రేమ, పెళ్లి ముచ్చట్లు ఉండవనేలా ఆయన స్కిట్లు సాగుతుంటాయి. కానీ రియల్‌ లైఫ్‌లో మాత్రం తాను అన్నింటిలోనూ తగ్గేదెలే అని చెప్పుకొస్తున్నాడు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్న న‌రేష్ త‌న ల‌వ‌ర్‌ని పరిచ‌యం చేశాడు. మేం విన్నది నిజమేనా అని న‌రేష్‌ని ర‌ష్మిక అడిగింది. దానికి న‌రేష్‌.. ఇన్ని రోజులు చాలా సీక్రెట్‌గా మెయింటేన్‌ చేశాను. నాకూ ఒక లవర్‌ ఉంది అంటూ తన ప్రియురాలిని స్టేజ్‌పైకి ఆహ్వానించారు.

ఆమె స్టేజ్‌పైకి వ‌చ్చి న‌రేష్‌పై త‌న ప్రేమ‌ని చాటుకుంది. , మాటల్లో చెప్పలేనంత ఆయ‌న న‌న్ను ల‌వ్ చేశారు. అంతటి ప్రేమనిచ్చాడు ఈ రెండేళ్లలో అని తెలిపింది. దీంతో నరేష్‌.. స్టేజ్‌పైనే ఆమెకి గులాబీ పువ్వు ఇస్తూ లవ్‌ని ప్రపోజ్‌ చేశాడు. అప్ప‌డు హార్ట్ బెలూన్, రోజాపువ్వు తీసుకుని న‌రేష్ ల‌వ‌ర్ ఆయనకు ముద్దు పెట్టింది . ఇక వీరిద్దరు కలిసి ప్రేమగీతానికి కొన్ని మూమెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు వీరికి సంబంధించిన విష‌యం నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అయితే న‌రేష్ తండ్రి కూడా ఈ షోకి హాజ‌రు కాగా, ల‌వ‌ర్స్ ఇద్ద‌రు కూడా ఆయ‌న కాళ్ల‌కి న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకున్నారు. అంటే వారి పెళ్లికి పేరెంట్స్ నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన‌ట్టేనా. మ‌రోవైపు నరేష్‌ది నిజంగానే ప్రేమనా, టీఆర్‌పీ కోసం చేసిన స్టంటా అనేది కూడా అనుమానంగా మారింది.

Exit mobile version