మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు స్టార్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కెరీర్‌లో ఒక్క మంచి హిట్ కూడా మనోడికి దక్కకపోవడంతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కన్నప్ప అనే టైటిల్‌తో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రంలో మధుబాల, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్.. ఇలా ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ నటించబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించడం మనం చూశాం. ఇక గురువారం మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
హీరో ముఖం చూపించకుండా శివలింగంపై ఓ యోధుడు విల్లు ఎక్కుపెట్టినట్లుగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఓ నాస్తికుడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారాడదన్నది కన్నప్ప సినిమాలో చూపించబోతున్నామని ఇదివరికే మంచు విష్ణు తెలియజేశాడు. పాన్ ఇండియన్ లెవెల్లో అత్యంత ప్రతిష్టటాత్మకంగా కన్నప్ప మూవీ తెరకెక్కిస్తున్నాడు మంచు విష్ణు. అప్పట్లో వాడిన ఆయుదాలు, పోరాటల నేపథ్యంలో యాక్షన్ సీక్వెన్స్‌తో కన్నప్పను నిర్మిస్తుండగా, ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా విడుదలైన కన్నప్ప పోస్టర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి, పాన్ ఇండియా సినిమాగా కన్నప్ప వచ్చే ఏడాది థియేటర్స్ లో సందడి చేయనున్నట్టు సమాచారం.
పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో కన్నప్ప చిత్ర రిలీజ్ కానుండగా, ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.మంచు విష్ణుకు హిట్ లేక చాలా రోజులు కావడంతో ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా న్యూజిలాండ్ అడవుల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమాకి అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ ‘కెచా’ వర్క్ చేస్తున్నారు.