Site icon vidhaatha

ఈ ర‌కంగా రామ్ చ‌ర‌ణ్ కూతురి ఫేస్ బ‌య‌ట ప‌డింది.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఆయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న‌లు పెళ్లైన 11 ఏళ్ల‌కి త‌ల్లిదండ్రులు అయిన విష‌యం తెలిసిందే. జూన్ 20న జ‌న్మించిన చిన్నారికి క్లింకార అని నామ‌క‌ర‌ణం చేశారు కుటుంబ స‌భ్యులు. అయితే పాప పుట్టిన‌ప్ప‌టి నుండి చిన్నారిని చూడాలని ఫ్యాన్స్ ఎంత‌గానో కోరుకుంటున్నారు. కాని మెగా ప్రిన్సెస్ ఫేస్ మాత్రం అస్స‌లు రివీట్ చేయ‌డం లేదు. ల‌వ్ ఎమోజీతోనే క‌వ‌ర్ చేస్తున్నారు.తాజాగా కూడా ఈ చిన్నారి ఫేస్‌ని క‌వ‌ర్ చేస్తూ ఓ ఫోటో షేర్ చేశారు. కాని నీటిలో పాప ఫేస్ క్లియ‌ర్‌గా క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.

నవంబర్ 1వ తేదీన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి వేడుక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఇట‌లీ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ పెళ్లి కోసం ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ తో పాటు , లావణ్య ఫ్యామిలీ కూడా ఇటలీ చేరుకుంది. ఇక ఇటలీలోని టుస్కానీలో కొణిదెల వారి ఫ్యామిలీతో పాటు కామినేని కుటుంబం స‌ర‌దాగా గ‌డుపుతుంది. ఈ క్ర‌మంలోనే చిరంజీవి సురేఖ, రామ్ చరణ్, ఉపాస‌న‌, శ్రీజ‌, ఆమె కూతుళ్లతో పాటు ప‌లువురు క‌లిసి ఫొటో దిగారు. ఈ ఫొటోని ఉపాస‌న షేర్ చేసింది. ఇక ఈ పిక్‌లో క్లింకార కూడా ఉండ‌గా, ఆమె ఫేస్ క‌నిపించ‌కుండా ల‌వ్ ఎమోజీని ఉంచింది. కాని నీటి లో పడిన ప్రతిబింబం లో క్లియర్ గా ఫేస్ కనిపించింది. దీంతో తొలిసారి రామ్ చరణ్ ఉపాసన ముద్దుల కూతురు క్లింకారా ఫేస్ రివీల్ అయిన‌ట్టు అయింది.

గత మూడు నెలలుగా పాప ఫేస్ కనిపించ‌కుండా మెగా ఫ్యామిలీ జాగ్ర‌త్త ప‌డ‌గా, చివరికి ఇటలీ డెస్టినేష‌న్‌ వెడ్డింగ్ లో మాత్రం చిన్నారి ఫోటో బయట ప‌డింది. ఇక ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి నవంబర్ 1వ తేదీన కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, శ్రేయోభిలాషుల న‌డుమ జ‌ర‌గ‌నుంది. 5వ తేదీన హైదరాబాద్ లో పెళ్లి రిసెప్షన్ వేడుక జ‌రిపించ‌నున్నారు. ఈ వేడుక‌కి ఇండ‌స్ట్రీకి సంబంధించిన సినీ నటీనటులతో పాటు రాజకీయ నేతల‌ని కూడా ఆహ్వానించ‌నున్నారు. ఈ సారి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు రోజుల ముందే త‌న స‌తీమ‌ణితో క‌లిసి ఇట‌లీకి వెళ్ల‌డం విశేషం. 

Exit mobile version