Site icon vidhaatha

మ‌హేష్-రాజ‌మౌళి సినిమా కోసం అన్ని కోట్ల బ‌డ్జెట్ కేటాయిస్తున్నారా… నిజంగా ఇది షాకింగే..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్న విష‌యం తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా రానున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొని ఉన్నాయి. ఇక ఈ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్ చిత్రం చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మార్చిలో ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది.

యాక్షన్‌ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రంలో మహేష్‌బాబు ఓ సాహసికుడి పాత్రని పోషిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ స్టోరీకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతుంది. దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ రాసిన పుస్తకాల ఆధారంగా మహేష్‌బాబు సినిమా కథ ఉంటుందని, వాటి స్ఫూర్తితో ఈ ప్రాజెక్ట్ ని రూపొందిస్తున్న‌ట్టు విజయేంద్రప్రసాద్ గ‌తంలో తెలిపారు. చిత్రంలో నేషనల్‌, గ్లోబల్‌ ఆర్టిస్ట్ లు ఉండబోతున్నారట. హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాని అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం కోసం 1500 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఓ తెలుగు హీరో నటించే సినిమాకు అంత భారీ బ‌డ్జెట్ కేటాయించ‌డం అతి పెద్ద రికార్డ్ అని చెప్పాలి. రాజ‌మౌళి సినిమాలు అంటే ఆయ‌న పెట్టిన దానికి భారీగా డ‌బ్బులు వ‌స్తాయ‌ని ఇప్ప‌టికే ప్రూవ్ అయింది. షూటింగ్‌కి ముందు వ‌ర్క్ షాప్ ఒక‌టి రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నాడ‌ని, ఇందులో మ‌హేష్ బాబు కూడా పాల్గొంటాడ‌ని స‌మాచారం.ఈ సినిమా మూడు భాగాలుగా రానుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ గ‌తంలో ప్ర‌క‌టించారు. ప్రపంచంలోని మూడు దేశాల్లో చిత్ర షూటింగ్‌ జరగనుంది. ఈ సినిమా షూటింగ్‌లో కొంత భాగం దట్టమైన అమెజాన్ అడవుల్లో జరగనుంది. ప్రముఖ హాలీవుడ్ స్టూడియో, కెఎల్ నారాయణతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. హీరోయిన్ , ఇతర నటీనటులను త్వరలోనే ఖరారు చేస్తారు. ఎంఎం కీరవాణి చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. ఈ యాక్షన్ చిత్రం షూట్ ఏప్రిల్ 2024లో ప్రారంభమవుతుంది.  

Exit mobile version