Site icon vidhaatha

Balakrishna: అసెంబ్లీలో బాలకృష్ణ హల్ చల్!! ప్లకార్డులతో నిరసన!!

విధాత‌: ఏపీ అసెంబ్లీ(AP Assembly)లో హిందూపురం ఎమ్మెల్యే(MLA) బాలకృష్ణ(Balakrishna) గురువారం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. సాధారణంగా రాజకీయాలను సీరియస్‌గా తీసుకోని బాలయ్య ఓ సినీ సెలబ్రిటీగా ఉండడానికే మొగ్గు చూపుతూ వస్తున్నారు. కానీ నేటి బడ్జెట్(Budjet) సమావేశాల్లో సభలో చంద్రబాబు లేకపోవడంతో బాలయ్య బాబు సారథ్యంలో టిడిపి నిరసన వ్యక్తం చేసింది.

బాలయ్య బాబు సారథ్యంలోని టిడిపి బృందం ‘ఏపీలో దివాలా బడ్జెట్’.. ‘జగన్ రెడ్డి కళకళ’.. ‘ప్రజలు గిలగిల’ అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకుని టీడీపీ సభ్యులతో కలిసి అసెంబ్లీకి బాలయ్య వచ్చారు. అప్పుల ఆంధ్రప్రదేశ్ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA)లు ప్ల‌కార్డులు ప్రదర్శిస్తూ సభకు వచ్చారు. వారితో పాటు బాలయ్య కూడా ఎమ్మెల్యే హోదాలో ఈ నిరసనలో పాల్గొన్నారు. అలా బాలయ్య తొలిసారిగా జగన్‌కి ఎదురు నిలిచి నిరసనలు తెలిపారు. ఆ తరువాత సభలోనూ ఆయన నిరసన తెలిపి తోటి సభ్యులతో సస్పెండ్ అయ్యారు.

అసెంబ్లీ బడ్జెట్ సెషన్ సందర్భంగా బాలయ్య రావడంతో కొంత సందడి కనిపించింది. బాలయ్య అసెంబ్లీ గాలరీలో ఉండగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆయన్ని పలకరించారు. మంత్రి బొత్స సత్యనారాయణ అయితే హీరో గారు బాగున్నారా అని బాలయ్యకు అభివాదం చేశారు. ఇక మరో మంత్రి గుడివాడ అమరనాథ్‌ని చూసిన బాలయ్య కోటు వేసుకోవడం మరచిపోయారా అంటూ సరదాగా కామెంట్స్ చేశారు.

Exit mobile version