Gold Anklets | అమ్మాయికి అందాన్ని తీసుకొచ్చేది నుదుటిన బొట్టు.. చేతులకు గాజులు, కాళ్లకు పట్టిలు. ఈ మూడు కూడా అమ్మాయిలకు అందాన్ని తీసుకొస్తాయి.. వయ్యారంగా కనిపించేలా చేస్తాయి. అయితే చాలా మంది మగువలు కాళ్లకు వెండి పట్టిలు( Silver Anklets ) ధరిస్తుంటారు. కొందరేమో బంగారు పట్టిలు( Gold Anklets ) ధరించి అందర్నీ ఆకర్షిస్తుంటారు. మరి కాళ్లకు బంగారు పట్టిలు ధరించొచ్చా..? ధరిస్తే ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయంలో బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. పసిడిని లక్ష్మీదేవి( Lakshmi Devi )కి ప్రతీకగా చెబుతుంటారు. లక్ష్మీదేవీకి ప్రతీకగా భావించే బంగారాన్ని మహిళలు చాలా వరకు నడుము వరకే ఆభరణాల( Ornaments ) రూపంలో ధరిస్తారు. ఒక వేళ కాళ్లకు బంగారం పట్టిలు ధరిస్తే లక్ష్మీదేవీని అగౌరవ పరిచినట్లుగా భావిస్తారు హిందువులు. కాబట్టి కాళ్లకు బంగారు పట్టిలు ధరించకపోవడమే మంచిది. ఒక వేళ ధరిస్తే అప్పుల బాధలు తప్పవని పండితులు హెచ్చరిస్తున్నారు.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. కాళ్లకు బంగారు పట్టిలు ధరించడం అశుభం. ఇలా కాళ్లకు బంగారు గొలుసులు ధరించడం మూలంగా ఆ ఇంట్లో సంపద నశిస్తుందని నమ్మకం. తమ వృత్తిలో కూడా పురోగతి ఉండదని చెబుతున్నారు. ప్రతికూలత ఏర్పడి.. అప్పులు అధికమై పోతాయని పేర్కొంటున్నారు. బంగారు పట్టిలు ధరించం వల్ల దుష్ట శక్తులతో పీడించబడతారని చాలామంది హిందువుల నమ్మకం.
కొంతమంది యువతులు ఫ్యాషన్, హుందాతనం కోసం కాళ్లకు బంగారు పట్టిలు ధరించినప్పటికీ సాంప్రదాయకంగా దినిని తప్పుగా భావిస్తున్నారు పండితులు. కాళ్లకు బంగారం ధరించడం అశుభమని అంటున్నారు.
