Mohammad Azharuddin | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. ఇప్పటికే అధికార పార్టీ 119 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేవలం తొలి జాబితాలను మాత్రమే ప్రకటించింది. కేవలం సగం అసెంబ్లీ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాయి ప్రతిపక్ష పార్టీలు. ఇంకా సగం నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
అయితే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ బరిలో దిగనున్నట్లు సమాచారం. ఖైరతాబాద్ బరిలో విజయారెడ్డి బరిలో దిగే అవకాశం ఉంది. ఇక అంబర్‌పేట టికెట్ రోహిన్ రెడ్డికి వచ్చే అవకాశం ఉందని వార్తలు షికారు చేస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్ రెండో జాబితాను వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. అధికార పార్టీని మట్టికరిపించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.