Site icon vidhaatha

Nitin Gadkari | టోల్‌ వసూలు విధానాన్నే మార్చివేయబోతున్నాం : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

Nitin Gadkari | త్వరలో కేంద్ర ప్రభుత్వం టోల్‌ ట్యాక్‌ వసూలు విధానాన్ని పూర్తిగా మార్చివేయబోతున్నదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద ట్యాక్స్‌ను శాటిలైట్‌ ఆధారిత టోల్‌ విధానం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. హైవేలపై ప్రయాణించే వారంతా ప్రయోజనం పొందుతారన్నారు. ఎందుకంటే ప్రయాణించే కిలోమీటర్ల సంఖ్యను బట్టి టోల్‌ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. నాగ్‌పూర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న టోల్‌ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానం అమలు చేయబోతున్నట్లు చెప్పారు. టోల్‌ ట్యాక్స్‌ బ్యాంకు ఖాతాల నుంచి ఆటోమేటిక్‌గా కట్‌ అవుతుందని.. ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జిలు వసూలు చేయనున్నట్లు తెలిపారు.

కొత్త విధానంలో సమయంతో పాటు డబ్బూ ఆదా అవుతుందన్నారు. గతంలో ముంబయి నుంచి పూణే ప్రయాణించడానికి 9గంటలు పట్టేదని.. ప్రస్తుతం 2 గంటలకు తగ్గించామన్నారు. దాంతో పాటు భారత మాల ప్రాజెక్టుపై నితిన్‌ గడ్కరీ స్పందించారు. భారత్‌మాల-1 ప్రాజెక్ట్ 34 వేల కిలోమీటర్లు, భారతమాల-2 దాదాపు 8500 కిలోమీటర్ల ప్రాజెక్ట్‌ అని తెలిపారు. దాంతో 2024 చివరి నాటికి ఈ దేశ ముఖచిత్రం పూర్తిగా మారుతుందన్నారు. నేషనల్ హైవే రోడ్ నెట్‌వర్క్‌ను అమెరికాతో సమానంగా తయారు చేయడమే తన ప్రయత్నమని.. అందులో తాను విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

Exit mobile version