Rythu Bharosa : రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించింది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రూ.12,000 (ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి) ఒక్కో సీజన్‌కు రూ.6 వేల చొప్పున రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం నుంచి జూన్ 25 వరకు విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి పంట పెట్టుబడి సాయం నిధులు జమ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
వాన కాలం పంటల సాగు పనుల్లో నిమగ్నమైన రైతులకు ఈ రైతు భరోసా డబ్బులు పెట్టుబడులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది.