మనకు ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా పిల్లలు ప్రయోజకులు అయి వారి కాళ్లమీద నిలబడి జీవితంలో సక్సెస్ అయితే తల్లిదండ్రులకి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడు సౌరవ్ గంగూలీ అలాంటి ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నాడు. తన కూతురు సనా గంగూలి ఉద్యోగస్తురాలిగా మారడం, మంచి జీతం పొందడంపై చర్చ నడుస్తుంది. సనా గంగూలీ ఇప్పుడు ఇంటర్న్ షిప్ లోనే భారీ వేతనంతో ఉద్యోగం సాధించి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ అమ్మడు కోల్ కతాలో ప్రాథమిక, మాధ్యమిక విద్యను పూర్తి చేసి లండన్ లోని యూసీఎల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.ఇక ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన సనాకు ఇప్పుడు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది.
రిపబ్లిక్ టీవీలో ప్రచురించిన వార్త ప్రకారం ప్రైస్ వాటర్ కూపర్స్, డెలాయిట్ ఉద్యోగాల నుండి సనా ఎవరూ ఊహించనంతగా భారీ జీతం పొందబోతున్నట్టు తెలుస్తుంది. సనా గంగూలీ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్స్ కన్సల్టింగ్ కంపెనీ అయిన పీడబ్ల్యూసీలో ఇంటర్న్ షిప్ చేస్తుండగా, ఆమె ఇప్పుడు భారీగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. పీడబ్ల్యూసీలో పనిచేసే వారికి రూ.30 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. ప్రస్తుతం నెలకు లక్ష రూపాయల జీతం అందుకుంటోందని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఫైనాన్స్ రంగంలోకి అడుగు పెట్టిందని రానున్న రోజులలో సనా మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని అంటున్నారు.
సనా.. స్కూల్ డేస్ లో తెలివైన స్టూడెంట్ కాగా, ఈమె యూసీఎల్ కాలేజీలో చదువుకుంటూనే హెచ్ ఎస్ బీసీ, గోల్డ్ మన్ శాక్స్ వంటి బహుళజాతి కంపెనీలతో ఇంటర్న్ షిప్ లు చేయడం ద్వారా కొత్త ఛాలెంజ్ కు సిద్ధమైంది. సనా కన్సల్టింగ్ సంస్థ డయోలాట్‌లో ఇంటర్న్‌గా భారతీయ కరెన్సీలో ఒకటిన్నర లక్షల రూపాయలు సంపాదించేది. ఆ సమయంలో తన తండ్రికి చాలా ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకుంది. ఇక గంగూలీ విషయానికి వస్తే ఆయన ఒకప్పుడు భారతీయ క్రికెట్‌లో ఎన్నో అద్భతాలు సృష్టించి ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పని చేశాడు.