Site icon vidhaatha

Stampede | ఆర్థిక సాయం పంపిణీలో తొక్కిసలాట.. 78 మంది మృత్యువాత..

Stampede | ఈదు-ఉల్‌-ఫితర్‌కు ముందు విషాదకర ఘటన చోటు చేసుకున్నది. యెమెన్‌ రాజధాని సనా నగరంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన తొక్కిసలాటలో 78 మంది మృతి చెందారు. డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారు. ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమంలో ఈ తొక్కిసలాట జరిగిందని హౌతీ ఆధ్వర్యంలో నడిచే అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమయంలో వేలాది మంది ప్రజలు గుమిగాడారు. స్థానిక అధికారుల సమన్వయం లేకుండా ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయడం వల్ల ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

ఓ పాఠశాలలో ఈ ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం నిర్వహించగా.. ఘటన తర్వాత తిరుగుబాటుదారులు పాఠశాలకు సీల్‌ వేశారు. అలాగే జర్నలిస్టులతో సహా ఎవరూ రాకుండా నిషేధం విధించారు. అయితే, సమాచారం మేరకు.. ఆర్థిక సాయం పంపిణీ చేస్తున్న సమయంలో హౌతీ తిరుగుబాటులు గాల్లోకి కాల్పులు జరిపారని, విద్యుత్‌ తీగలకు తగిలి పేలుడు జరిగింది. ఆ తర్వాత జనం భయాందోళనకు గురై ఒక్కసారిగా పరుగులు పెట్టగా తొక్కిసలాట చోటు చేసుకున్నది. నిర్వాహకులను అదుపులోకి తీసుకు విచారిస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.

Exit mobile version