మలయాళీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకి తన మాటలతో చాలా దగ్గరైన యాంకరమ్మ సుమ. తెలుగు సీరియల్స్‌తో ఎంట్రీ ఇచ్చిన యాంకర్ సుమ కనకాల ఎన్నో యేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. ఎంత మంది కొత్త యాంకర్స్ వచ్చిన, పొట్టి దుస్తులలో అందాలు ఆరబోసిన సుమని మాత్రం డామినేట్ చేయలేకపోతున్నారు. ఇప్పటికీ పెద్ద హీరోల ఈవెంట్స్ అంటే సుమ ఉండితీరాల్సిందే. గత 20 ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులను అటు టీవి షోలతోనూ, ఇటు ఈవెంట్స్‌తోనూ, మరోవైపు ఆడియో రీలిజ్‌లు, ప్రీ రిలీజ్‌లతో తెగ అలరిస్తూ వస్తుంది. ట్రెండ్‌కి తగ్గట్టు సుమ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో అలరిస్తుంది.ఇప్పుడు సుమ తన కొడుకు రోషన్‌ని హీరోగా పరిచయం చేసే ప్రయత్నం కూడా చేస్తుంది.
తాజాగా సుమ దీపావళి ఈవెంట్‌లో మెరిసింది. ఈ ఈవెంట్‌కి సుమ తనయుడు రోషన్ కనకాల కూడా హాజరయ్యాడు.రోషన్ తొలి చిత్రం బబుల్ గమ్ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో తన తల్లితో పాటు పలు ఈవెంట్స్‌కి హాజరు అవుతున్నాడు.ఇక ఈ షోలో మరో సీనియర్ యాంకర్ శిల్పా చక్రవర్తి కూడా హాజరైంది. శిల్పా చక్రవర్తి, సుమ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉండగా, సుమ ఈ పొజీషన్‌కి చేరుకోవడానికి ఎంత కష్టపడిందో వివరించింది. సుమ కొన్ని సార్లు షూటింగ్స్ నుంచి ఆలస్యంగా రావలసి వచ్చేది. అప్పుడు తలుపు తట్టిన కూడా ఎవరు తీయకపోవడంతో ఆమె రాత్రిళ్లు బయట మెట్లపైనే పడుకోవటం నేను చూశాను అని చెప్పింది శిల్పా చక్రవర్తి .
శిల్పా మాటలకి సుమకి పాత రోజులు గుర్తుకు రావడంతో కంట కన్నీరు పెట్టుకుంది. ఇక సుమ ఎమోషనల్ కావడంతో రోషన్ తన తల్లిని ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఇమ్మాన్యూల్, నూకరాజు, చలాకి చంటి లాంటి వాళ్ళు తమ ఫన్నీ స్కిట్స్ తో నవ్వించే ప్రయత్నం చేసారు. తాజాగా విడుదలైన దీపావళి షోకి సంబంధించిన ప్రోమో అందరిని ఆకట్టుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే సుమ తాతగారికి 98యేళ్లు కాగా, ఆయన ఈ వయస్సులో ఓ రికార్డు క్రియేట్ చేశారు. సుమ అమ్మమ్మ గారి బ్రదర్ అయిన పి. బాలసుబ్రమణ్యన్ మీనన్ గత 73 యేళ్లనుంచి న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్నారు. ఇన్నాళ్ల లాంగ్ కేరీర్ కంప్లీట్ చేసుకున్న ఏకైక లాయర్‌గా తాతయ్య వరల్డ్ రికార్డును కైవసం చేసుకున్నారు. ఈ విషయాన్ని సుమ తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ సంతోషంగా ఉందని తెలిపింది.