Site icon vidhaatha

Telangana Governor’s speech: తెలంగాణ కలల సాకారానికే ఈ బడ్జెట్ : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

Telangana Governor’s speech : తెలంగాణ కలల సాకారానికి నిబద్ధత 2025-26వార్షిక బడ్జెట్ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన శాసన సభ, శానస మండలి సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. సమ్మిళతత్వం, స్వయం సమృద్ధి, సాధికారిక తెలంగాణ అనే విజన్ తో సాహసోపేత సంస్కరణలు. ప్రజాకేంద్రీకృత సుపరిపాలన, నిర్ణయాత్మక నాయకత్వంతో తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామన్నారు. తెలంగాణ గుర్తింపు, వారసత్వాన్ని గౌరవించేందుకు గద్దర్, గూడ అంజయ్య, బండి యాదగిరి వంటి వారిని గౌరవించుకున్నామన్నారు. రాష్ట్ర గేయంగా జయజయహే తెలంగాణ గీతాన్ని అధికారికంగా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ విశిష్టతను చాటేలా తెలంగా తల్లి విగ్రహ అధికారిక ఆవిష్కరణ చేసుకున్నామన్నారు.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రైతుల సంక్షేమానికి రూ.2లక్షల చోప్పున 25.35లక్ష్లల మంది రైతులకు రూ.20,616కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12వేలు అందిస్తున్నామని గుర్తు చేశారు. తెలంగాణ నేడు 260లక్షల టన్నుల రికార్డు ధాన్య ఉత్పత్తితో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వ్యవసాయ కార్మిక కుటుంబాలకు ఏడాదికి రూ.12వేలు అందిస్తున్నామని చెప్పారు. సన్నరకం ధాన్యం క్వింటాల్ కు రూ.500బోస్ చోప్పున 1,206.44కోట్ల అందించామన్నారు. వ్యవసాయ రంగ ప్రగతిని కాంక్షిసూ వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. కృష్ణా జలాల వాట కోసం ట్రబ్యూనల్ వద్ధ వాదనలు వినిపించామని గుర్తు చేశారు.

మహిళా సాధికారత సాధనలో ఇందిరా మహిళా శక్తి కమిషన్ పాలసీ ద్వారా లక్ష్య మంది మహిళా పారిశ్రామిక వేత్తల తయారీకి లక్ష కోట్ల సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. మహాలక్ష్మి పథకం గేమ్ ఛేంజర్ గా ఉండి మహిళలకు 149.63కోట్ల ఉచిత బస్సు ట్రిప్పులను కల్పిస్తూ ప్ రూ.5005.95కోట్ల ప్రయాణ ఖర్చులను వారికి ఆదా చేశామని, ఈ చర్య వారి గమన శీలతనే కాకుండా స్వేచ్చ, గౌరవం, ఆర్థిక సాధికారితను చాటుతుందన్నారు.

50లక్షల పేద కుటుంబాలకు గృహజ్యోతి పథకంతో 200యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తున్నామన్నారు. 43లక్షల కుటుబాలకు రూ.500గ్యాస్ సబ్సీడీ అందిస్తున్నామని..1000మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్లను మహిళా సంఘాలకు కేటాయిస్తున్నామన్నారు.

యువజన సాధికారితకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశామని వివరించారు. గత ఏడాది కాలంలో 55వేల ఉద్యోగాలు యువతకు ఇచ్చామని ప్రకటించారు. క్రీడల్లో అభివృద్ధికి యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యూకేషన్, స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లును ఆమోదించామన్నారు. తెలంగాణ విద్యావ్యవస్థ బలోపేతం కోసం విద్యాకమిషన్ ఏర్పాటు చేశారని.. డైట్ చార్జీలను 40శాతం, కాస్మోటిక్ చార్జీలను 200శాతం పెంచి మెనూ చార్జీలను పెంచి నాణ్యమైన భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. ఆమ్మ ఆదర్శ పాఠశాలలను ప్రారంభించి స్వయం సహాయక సంఘాలకు నిర్వాహణ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ఆరోగ్య తెలంగాణ సాధనకు ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి 10లక్షలు పెంచామన్నారు. చికిత్స చేసే రోగాల సంఖ్యలో మరో 163 చికిత్సలను చేర్చామని వెల్లడించారు.

సామాజిక న్యాయం, సమాన అవకాశాల దిశగా విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును ప్రతిపాదించామని గుర్తు చేశారు. జస్టీస్ షమీర్ అక్తర్ కమిషన్ సిఫారసుల ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు తేబోతున్నామన్నారు. ఫిబ్రవరి 4న ఆ రెండు బిల్లులను ప్రతిపాదించి ఆరోజును తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటించామని తెలిపారు.

కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం, చేనేత కార్మికులకు తెలంగాణ చేనేత అభయ హస్తం పథకాలు అమలు చేస్తున్నామన్నారు. జౌళీ, మరమగ్గ రంగాల కార్మికుల అభ్యున్నతికి వేములవాడ వద్ధ రూ.50కోట్ల యార్న్ డిపో ఏర్పాటు చేశామని వివరించారు. నేత కార్మిలకు సంక్షేమం కోసం స్వయం సహాయక మహిళలకు 64.70లక్షల మందికి ఏటా రెండు చీరలు ఇవ్వనున్నామన్నారు.

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ దావోస్ వేదికగా 49,500మంది ఉద్యోగాల కల్పించేలా రూ.1,778,950కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించిందన్నారు. డాటా సెంటర్లు, హరిత ఇంధనం, ఆహార ప్రాసెసింగ్, ఎలక్ట్రికల్ వెహికల్స్, రక్షణ రంగ తయారీ వంటి రంగాలలో పెట్టుబడులను సాధించామన్నారు. కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని రూపొందిస్తున్నామని, తెలంగాణను ఏఐ,డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా సుస్థిర స్థానంలో నిలబెడుతున్నామని చెప్పారు.

తెంగాణ టూరిజం అభివృద్ధికి నూతన పర్యాటక అభివృద్ధి పాలసీ రూపొందించామని గుర్తు చేశారు. తెలంగాణ 2025 స్వచ్ఛ, హరిత ఇందన పాలసీనీ రూపొందించామని, 2030నాటికి రాష్ట్రంలో 600విద్యుత్తు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని చెప్పారు.

భూపరిపాలన బలోపేతం కోసం భూభారతి చట్టాన్ని ప్రవేశ పెట్టి అధునిక, సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ మ్యాపింగ్ ద్వారా భూమి హక్కుల రక్షణను పటిష్టం చేశామని తెలిపారు. భూసంస్కరణలతో పాటు గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామన్నారు. శాంతిభద్రతల పటిష్టత దిశగా ప్రపంచ స్థాయి విద్యా సంస్థ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కు శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. తెలంగాణ విపత్తు ప్రతిస్పందన దళం(ఎస్డీఆర్ఎఫ్) ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

తెలంగాణ భవిష్యత్తు విజన్ లో భాగంగా మెట్రో రైలు విస్తరణ, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ ఏర్పాటు ప్రాజెక్టులను చేపట్టామని తెలిపారు. ప్రపంచ స్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్ధుకోబోతుందన్నారు. తెలంగాణ బడ్జెట్ కేవలం అంకెల కూర్పు కాదని..భవిష్యత్తు కోసం ప్రభుత్వ ప్రాధాన్యతలకు, విజన్ కు ప్రతిబింబమని స్పష్టం చేశారు.

నేటి తెలంగాణ అవకాశాలు అభివృద్ధి, సాధికారిత గల రాష్ట్రంగా ఉంటే..రేపటి తెలంగాణ మరింత ఉజ్వలమైందని, ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయ పరిపుష్టి, సాంకేతిక విజ్ఞాన వినూత్నత, సామాజిక న్యాయం, మానవ ప్రాభావానికి అగ్రగామి రాష్ట్రంగా మారుతుందని గవర్నర్ ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి డైనమిక్ నాయకత్వంలో సమృద్ధి, సమానత్వం, పురోగతిలో దేశానికి దిక్సూచి అయ్యే తెలంగాణ నిర్మాణానికి సంఘటితంగా, విశ్వాసంతో, స్థిరమైన నిబద్ధతతో అంతా ముందడుగు వేద్దామని గవర్నర్ పిలుపునిచ్చారు.

Exit mobile version