విధాత, హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్‌గా నియామకమైన జిష్ణుదేవ్ వర్మ బుధవారం పదవీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో బుధవారం సాయంత్రం 5.03 గంటలకు ఆయన గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు రాజ్‌భవన్ పేర్కొంది. రెండురోజుల కిందట కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. జిష్ణుదేవ్ వర్మ 2018 నుంచి 2023 వరకూ త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పని చేశారు. గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా సేవలందించారు. త్రిపుర రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ వర్మ రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. త్రిపుర ప్రభుత్వంలో ఆయన మంత్రిగా విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ధిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు.
TELANGANA | నేడు తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం
