విధాత : తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) కొడుకు ప్రతీక్ దేవ్ వర్మ( Pratik Dev Varma) తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని త్రిపుర రాష్ట్రానికి చెందిన టీఎంపీ పార్టీ ఎమ్మెల్యే ఫిలిప్ రియాంగ్(Philip Reang) పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ త్రిపురలోని(Tripura) ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గొడవ చేస్తున్న ముగ్గురిని బయటికి వెళ్లమని చెప్పినందుకు… ప్రతీక్ దేవ్ వర్మతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు తనను చంపేస్తామని బెదిరించారని టీఎంపీ ఎమ్మెల్యే ఫిలిప్ రియాంగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
400నుంచి 500 బీజేపీ(BJP) కార్యకర్తలను తీసుకొచ్చి తనను, తన కుటుంబం మొత్తాన్ని చంపేస్తామన్నారని ఎమ్మెల్యే ఫిలిప్ రియాంగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుుని దర్యాప్తు చేస్తున్నారు.