తెలంగాణలో సోమవారం నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రం కూడా లీక్ అయినట్లుగా సాగుతున్న ప్రచారం సంచలనం రేపుతుంది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఉదయం 9:30 కి పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికి 9:37కు ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది.
తాండూర్ లోని ఓ పరీక్ష కేంద్రం నుండి పేపర్ లీక్ అయినట్లుగా భావిస్తున్నారు. అయితే ప్రశ్న పత్రం లీకేజీ ప్రచారాన్ని వికారాబాద్ డి ఈ ఓ రేణుకా దేవి మాత్రం ఖండించారు.
వికారాబాద్: పది పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ? వాట్సాప్‌లో చక్కర్లు.. విచారణ చేపట్టిన పోలీసులు | Vidhaatha | Latest Telugu Newshttps://t.co/ZCO6UtE3Sd #TELANGANA #VIKARABAD #SSCLEAK #TELUGU #HYDERABAD pic.twitter.com/qhSHwI0kEU
— vidhaathanews (@vidhaathanews) April 3, 2023
విచారణ చేపట్టిన పోలీసులు
వికారాబాద్ టెన్త్ పేపర్ లీకేజీ పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాండూరు నెంబర్ వన్ స్కూల్ కు చేరుకున్న పోలీస్ అధికారులు విచారణ జరిపి బందెప్ప అనే టీచర్ వాట్సాప్ నుంచి పేపర్ లీక్ చేసినట్లు నిర్ధారించారు. ఈ విషయమై కలెక్టర్ నారాయణరెడ్డితో డీఈవో రేణుకా దేవి భేటీ అయ్యి ప్రశ్నాపత్రం లీకేజీ విషయమై తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు.
కాగా.. పేపర్ లీక్ వ్యవహారంలో తాండూర్ నంబర్ 1 సెంటర్ చీఫ్ సూపరిండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ బందెప్ప ముగ్గురు ఉద్యోగులను విద్యాశాఖ సస్పెన్షన్ చేసింది. కేసు నమోదు చేసిన వికారాబాద్ పోలీసులు ఇన్విజిలేటర్ బందప్ప మొబైల్ నుంచి పేపర్ లీక్.. పై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు.