Site icon vidhaatha

KCR| బీఆర్ఎస్ ముఖ్యులతో కేసీఆర్ అత్యవసర భేటీ

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్(BRS)అధినేత, మాజీ సీఎం కేసీఆర్గు(KCR) రువారం పార్టీ ముఖ్య నేతలతో తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అత్యవరసరంగా భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంతో పాటు కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందచనున్న నేపథ్యంలో వాటిపై చర్చించారు. ఆయా అంశాలపై పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అలాగే ఆగస్టులో బీసీ బిల్లుపై రాష్ట్రపతిని కలిసే అంశం..కరీంనగర్ లో నిర్వహించే బీసీ సభ ఏర్పాట్లపైన కూడా పార్టీ నేతలు కేసీఆర్ తో చర్చించినట్లుగా సమాచారం. ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు టి.హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు సహా పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు.

మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైందని బీఆర్ఎస్ తరపు న్యాయవాది మోహిత్ రావు పేర్కొన్నారు. అనర్హ త పిటిషన్ల పై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పారని..విచారణకు ఎమ్మెల్యేలు సహకరించకపోతే తగువిధంగా స్పందించే అవకాశం ఉందనని..మేము ఏదైతే వాదించేమో అది సుప్రీంకోర్టు తీర్పులో వచ్చిందన్నారు. రోజువారిగా చేస్తే మూడు నెలల్లో విచారణ ప్రక్రియ ముగుస్తుందని..మూడు నెలలకు మించి సమయం కావాలి అంటే అందుకు తగిన సాక్షాలు ఆధారాలు చూపించాల్సి ఉంటుందన్నారు.

Exit mobile version