Site icon vidhaatha

PM Kisan Samman Nidhi| రైతుల ఖాతాల్లోకి నేడు పీఎం కిసాన్‌ 20వ విడత నిధులు

విధాత: రైతుల ఖాతాల్లో(Farmers Accounts)కి నేడు(To Day) పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM Kisan Samman Nidhi), నిధులు జమ(Deposit)కానున్నాయి. దేశ వ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు రూ. 2000 చోప్పన జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింది అర్హులైన రైతులకు రూ.20,500 కోట్లు జమ చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్‌ నిధులు విడుదలను ప్రారంభించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద లబ్ధిదారులైన రైతులకు ఏటా ప్రతి నాలుగు నెలలకొకసారి మూడు విడుతల్లో రూ.6000జమ చేస్తుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో 19విడత నిధులు జమ చేశారు. ఇప్పటిదాక ఈ పథకం ద్వారా రైతులకు మొత్తం రూ.3.69 లక్షల కోట్లను పంపిణీ చేయగా..20వ విడత నిధులతో ఈ మొత్తం ఏకంగా రూ.3.89 లక్షల కోట్లను దాటనుంది. పీఎం కిసాన్ 20వ విడతలో  9.7 కోట్ల కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. ఈ కేవేసీ, భూమి రికార్డు ధృవీకరణ, ఆధార్ లింక్ ఉన్న వారికి ఈ పథకం ప్రయోజనం అందనుంది.

 

Exit mobile version