Bank Holidays in July | జూలై మాసంలో 12రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆర్బీఐ బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను రిలీజ్ చేసింది. ప్రతి నెలా బ్యాంకులకు సెలవులు వస్తుంటాయి. పండుగలతో పాటు ప్రత్యేకమైన రోజుల్లో సెలవులు వస్తుంటాయి. అయితే, ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. సెలవులుంటాయో తెలుసుకోవడం మంచిది. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని 12 రోజులు జూలైలో సెలవులు ఉండనున్నాయి.
అయితే, బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్నెట్ బ్యాంక్, యూపీఐ సర్వీసులు నిరంతరాయంగా పని చేయనున్నాయి. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు వీలుంటుంది. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉండనున్నాయి. పలు బ్యాంకులు క్యాష్ డిపాజిట్ కోసం మెషిన్స్‌ను సైతం అందుబాటులో ఉంచింది. వీటితో అకౌంట్‌లో డబ్బులు చేసుకునే వీలున్నది. కొన్ని సేవల కోసం బ్యాంకులకు వెళ్లే అవసరం ఉంటుంది. అలాంటి సమాచారం సెలవుల గురించి సమాచారం ఉంటే.. ముందస్తుగానే పనులు చేసుకునే వీలు కలుగుతుంది.
జూలై బ్యాంకులు సెలవులు ఇవే..
జూలై 3 : బెహ్డియెన్‌ఖ్లామ్ పండుగ షిల్లాంగ్‌లో బ్యాంకుల మూసివేత.
జూలై 6 : ఎంహెచ్‌ఐపీ డే సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులు సెలవు.
జూలై 7 : ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత.
జూలై 8 : కాంగ్ రథజాత్ర సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులకు హాలీడే.
జూలై 9 : ద్రుక్పా త్షే జీ సందర్భంగా గాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు.
జూలై 13 : రెండో శనివారం సందర్భంగా బ్యాంకులు మూసివేత.
జూలై 14 : ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
జూలై 16 : హరేలా సందర్భంగా డెహ్రాడూన్‌లో హాలీడే.
జూలై 17 : మొహర్రం సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకుల మూసివేత.
జూలై 21 : ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు.
జూలై 27 : నాల్గో శనివారం దేశ్యాప్తంగా మూసివేత.
జూలై 28 : ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలీడే.