BSNL | జియో, ఎయిర్‌టెల్‌ ఒక వైపు.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మరోవైపు..! రూ.249 ప్లాన్‌ ప్రకటించిన టెలికాం సంస్థ

BSNL | టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా టారిఫ్‌ ధరలను భారీగా పెంచాయి. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దాదాపు 26శాతం వరకు ధరలను పెంచబోతున్నాయి.

  • Publish Date - July 3, 2024 / 10:15 AM IST

BSNL | టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా టారిఫ్‌ ధరలను భారీగా పెంచాయి. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దాదాపు 26శాతం వరకు ధరలను పెంచబోతున్నాయి. అయితే, ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిలెడ్‌ (BSNL) సంచలన నిర్ణయం తీసుకున్నది. మిగతా కంపెనీలకు భిన్నంగా యూజర్లకు ఊరట కలిగించేలా సరికొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఈ ప్లాన్‌ ధర కేవలం రూ.249 కావడం విశేషం. ఇక ఈ కొత్త ప్లాన్ 45 రోజుల కాల‌ప‌రిమితితో వ‌స్తుంది. ఇది సాధారణ ప్లాన్‌ల కంటే చాలా ఎక్కువ.

భారత్‌లోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్ సౌక‌ర్యం ఉంటుంది. రోజుకు 2జీబీ డేటా, నిత్యం వంద ఉచిత ఎస్‌ఎంఎస్‌ల‌ను వినియోగదారులు వాడుకునే అవకాశం కల్పిస్తున్నది. ఇక ఇదే ధ‌ర‌లో ఎయిర్‌టెల్ కూడా త‌మ ఓ ప్లాన్‌లను అందిస్తున్నది. అయితే, ప్లాన్‌ గడువు కేవలం 28 రోజులే. రోజుకు ఒక జీబీ డేటా మాత్రమే వస్తుంది. అదే బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న ప్లాన్‌లో కాలపరిమితి 45రోజులు కావడం విశేషం. మరోవైపు 2జీబీ డేటా ఇస్తున్నది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌లో యూజర్లకు అదనంగా 17 రోజులు సర్వీసులు అందిస్తున్నది. అలాగే రోజువారీ డేటా అదనంగా వస్తున్నది. అధిక టారీఫ్‌ల నుంచి ఉపశమనాన్ని కోరుకునే యూజర్లను ఆకర్షించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ తక్కువ ధరతో ఈ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌పై యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Latest News