WhatsApp | వాట్సాప్‌లో ఈ పనులు అస్సలు చేయొద్దు..! చేస్తే శాశ్వతంగా అకౌంట్‌ బ్యానే..!

WhatsApp | ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న ఇన్‌స్టంట్‌ మెసేజ్‌ ప్లాట్‌ఫాంలలో వాట్సాప్‌ ఒకటి. రోజు రోజుకు ఈ యాప్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. వినియోగదారులను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నది.

  • Publish Date - June 17, 2024 / 10:20 AM IST

WhatsApp | ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న ఇన్‌స్టంట్‌ మెసేజ్‌ ప్లాట్‌ఫాంలలో వాట్సాప్‌ ఒకటి. రోజు రోజుకు ఈ యాప్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. వినియోగదారులను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఈ క్రమంలో యూజర్లకు భద్రతాపరమైన హెచ్చరికలు చేస్తూ వస్తుంటుంది. చాలామంది వాట్సాప్‌లో తెలిసితెలియక చేసే పనులతో అకౌంట్స్‌ బ్యాన్‌ అవుతూ వస్తుంటాయి. పొరపాట్లు తెలిసి తెలియక చేసిన తప్పులతో కంపెనీ అకౌంట్‌ను శాశ్వతంగా తొలగించే అవకాశాలుంటాయి.

అయితే, నిబంధనలు ఉల్లంఘించినందుకు ఖాతాలను సస్పెండ్‌ చేస్తూ వస్తుంటుంది. వాస్తవానికి వాట్సాప్‌ అకౌంట్‌ను చాలా కారణాలతో బ్యాన్‌ చేస్తుంటుంది. ఆయా కారణాల విషయానికి వస్తే.. ఒకటి కంటే ఎక్కువగా వినియోగదారుల ఖాతాలపై రిపోర్టింగ్‌ వస్తే ఆ వాట్సాప్‌ అకౌంట్‌ను బ్యాన్‌ చేసే అవకాశం ఉంటుంది. అలాగే బల్క్‌ మెసేజ్‌లలో తెలియని కంటెంట్‌ను షేర్‌ చేసిన సందర్భాల్లోనూ అకౌంట్‌ను నిషేధించే ఛాన్స్‌ లేకపోలేదు. వైరస్‌లు, మాల్వేర్‌ ఉన్న ఫైల్స్‌ను పంపడం.. తరుచూ వివిధ గ్రూప్స్‌లో చేరడంతో వ్యక్తిగత డేటాను తొలగించడం చేయొద్దు.

సర్వీసెస్‌ నిబంధనలు ఉల్లంఘించడం.. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను షేర్‌ చేయడం, థర్డ్‌ పార్టీ లిస్ట్‌ని ఉపయోగించడం, పుకార్లను వ్యాప్తి చేయడం, పెద్దమొత్తంలో సందేశాలను పంపడానికి చట్టవిరుద్ధమైన థర్డ్‌ పార్టీ యాప్‌ను ఉపయోగించడం, ఏదైనా వినియోగదారుడి అనుమతి లేకుండా గ్రూప్‌లో యాడ్‌ చేయడం, ఎక్కువ సందేశాలను ప్రసారం చేయడం, తక్కువ సమయంలో ఎక్కువ గ్రూప్‌లు, పరిచయాలకు సందేశాలను పంపడం తదితర కారణాలతో వాట్సాప్‌ అకౌంట్‌ను బ్యాన్‌ చేసే అవకాశాలున్నాయి. ఈ విషయాలను వాట్సాప్‌ యూజర్లు తప్పనిసరిగా తెలుసుకోవడం బెటర్‌. ఆయా విషయాలపై అవగాహన ఉండడం పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, వాట్సాప్‌ ఎప్పటికప్పుడు ఆయా విషయాలపై దృష్టిని సారించి.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునే విషయం తెలిసిందే. ఇప్పటికే లక్షలాది అకౌంట్లను వాట్సాప్‌ తొలగించింది.

Latest News