Gold Rates | పసిడి కొనుగోలుదారులకు బిగ్‌ రిలీఫ్‌.. తులం బంగారం ధర ఎంత తగ్గిందంటే..?

Gold Rates | పసిడి ధరలు కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చాయి. వరుసగా రెండోరోజు స్వల్పంగా దిగివచ్చాయి. మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో ధర తగ్గుముఖం పట్టింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.400 తగ్గి తులానికి రూ.66,750కి తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రూ.430 తగ్గి తులానికి రూ.72,820కి దిగివచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,980కి తగ్గింది.

  • Publish Date - May 14, 2024 / 10:35 AM IST

Gold Rates | పసిడి ధరలు కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చాయి. వరుసగా రెండోరోజు స్వల్పంగా దిగివచ్చాయి. మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో ధర తగ్గుముఖం పట్టింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.400 తగ్గి తులానికి రూ.66,750కి తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రూ.430 తగ్గి తులానికి రూ.72,820కి దిగివచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,980కి తగ్గింది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,750 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,820కి దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,970కి చేరింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.66,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.72,820 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర భారీగా పెరిగింది. రూ.700 వరకు పెరిగి.. ఢిల్లీలో కిలో రూ.87,200కి పెరిగింది.

హైదరాబాద్‌లో రూ.90,700 ఎగిసింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Latest News