Gold Price| పసిడి ప్రియులకు గుడ్ న్యూస్…రూ.6వేలు తగ్గుదల

పైపైకి వెళ్లడమే తప్ప..తగ్గేదే లేదనే బంగారం ధరలు ఆకస్మాత్తుగా రికార్డు తగ్గుదలను నమోదు చేసి పసిడి ప్రియులకు తగ్గుదలలోనూ షాక్ ఇచ్చాయి. తులం బంగారం ధర ఒక్క రోజునే ఏకంగా ఒకేసారి రూ.6వేలు తగ్గింది.

విధాత : పైపైకి వెళ్లడమే తప్ప..తగ్గేదే లేదనే బంగారం ధరలు(Gold Price) ఆకస్మాత్తుగా రికార్డు తగ్గుదలను(Rate Drop) నమోదు చేసి పసిడి ప్రియులకు తగ్గుదలలోనూ షాక్ ఇచ్చాయి. తులం బంగారం ధర ఒక్క రోజునే ఏకంగా ఒకేసారి రూ.6వేలు తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల పసిడి ధర రూ.1,28,150కి చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,500కు చేరుకుంది. మంగళవారంతో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.6 వేలు తగ్గింది.

కిలో వెండి ధర రూ.2వేలు తగ్గి రూ.1,80,000కు చేరుకుంది. ఇటీవల రికార్డు పెరుగుదల నమోదు చేసిన బంగారం, వెండిలపై ఇన్వెస్టర్లు లాభార్జనకు దిగడం, అమెరికా డాలర్‌ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త ఉపశమించిన నేపథ్యంలో ధరలు తగ్గాయాని బులియన్‌ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.