విధాత : భారత్ లో బంగారం ధర సరికొత్త రికార్డులను (Gold Price Record High) నమోదు చేస్తూ దూసుకపోతుంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం రూ.1,30,850కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,17,780గా ఉంది. పసిడి బాటలోనే వెండి(Silver price) కూడా పైపైకి వెళ్లిపోతుతుంది. కిలో వెండి ధర రూ.1,85,763గా నమోదైంది.
దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతాయనే వారికి నిరాశే ఎదురవుతుంది. అమెరికా సుంకాలు, అంతర్జాతీయ మార్కెట్ లో పెట్టుబడి దారులు పసిడి అనుకూలమని భావించడం ధరల పెరుగులకు కారణమవుతుంది. పసిడి ధరలు ఇలాగే పెరుగుతూ పోతూ ఈ ఏడాది రూ.1లక్ష 50వేల మార్కు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పసిడి అందని ద్రాక్షగా మారిపోయింది.