Gold-Silver Rates | మగువలకు షాక్‌ ఇచ్చిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎంత పెరిగాయంటే..?

Gold-Silver Rates | మగువులకు పసిడి ధరలు షాక్‌ ఇచ్చాయి. ఇటీవల స్వల్పంగా తగ్గుతూ వచ్చిన ధరలు శనివారం బులియన్‌ మార్కెట్‌లో పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగి తులానికి రూ.66,250కి ఎగిసింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.120 పెరిగి తులానికి రూ.72,280కి పెరిగింది.

  • Publish Date - June 29, 2024 / 10:42 AM IST

Gold-Silver Rates | మగువులకు పసిడి ధరలు షాక్‌ ఇచ్చాయి. ఇటీవల స్వల్పంగా తగ్గుతూ వచ్చిన ధరలు శనివారం బులియన్‌ మార్కెట్‌లో పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగి తులానికి రూ.66,250కి ఎగిసింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.120 పెరిగి తులానికి రూ.72,280కి పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,930కి దూసుకెళ్లింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,550 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,280కి చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,420కి పెరిగింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.66,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.72,280కి పెరిగింది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. మరో వైపు వెండి నిలకడగా కొనసాగుతున్నది. ఢిల్లీలో ధర వెండి రూ.90వేలు ఉండగా.. హైదరాబాద్‌లో రూ.94,500 ధర పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Latest News