Gold Rate | పసిడి కొనుగోలుదారులకు అలెర్ట్‌.. మార్కెట్‌లో నేటి ధరలు ఇవే..!

Gold Rate | ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. పసిడి ధరలు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. శనివారం బులియన్‌ మార్కెట్‌లో ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. తాజాగా ఆదివారం మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 కార్యెట్ల గోల్డ్‌ రూ.67,250 వద్ద ట్రేడవుతున్నది. 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.73,360 వద్ద నిలకడగా కొనసాగుతున్నది.

  • Publish Date - May 12, 2024 / 10:35 AM IST

Gold Rate | ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. పసిడి ధరలు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. శనివారం బులియన్‌ మార్కెట్‌లో ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. తాజాగా ఆదివారం మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 కార్యెట్ల గోల్డ్‌ రూ.67,250 వద్ద ట్రేడవుతున్నది. 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.73,360 వద్ద నిలకడగా కొనసాగుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,640 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.73,360 వద్ద ట్రేడవుతున్నది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.67,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,510 వద్ద నిలకడగా ఉన్నది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.73,360 వద్ద స్థిరంగా ఉన్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం నిలకడగా ఉన్నాయి. ఢిల్లీలో కిలో రూ.87వేలు ఉండగా.. హైదరాబాద్‌లో రూ.90,500 వద్ద స్థిరంగా ఉన్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Latest News