Gold-Silver Rates | తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

Gold-Silver Rates | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తున్నాయి. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు బుధవారం బులియన్‌ మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.73,200 పలుకుతున్నది.

goldrate

Gold-Silver Rates | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తున్నాయి. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు బుధవారం బులియన్‌ మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.73,200 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.67,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.73,750కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.73,200 వద్ద స్థిరంగా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.73,350 వద్ద నిలకడగా ఉన్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం పసిడి రూ.73,200 వద్ద కొనసాగుతున్నాయి. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. ఇక వెండి ధర స్థిరంగా ఉన్నది. ఢిల్లీలో కిలో ధర రూ.95,100 ఉండగా.. హైదరాబాద్‌లో కిలో రూ.99,600గా ఉన్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.