Maruti Suzuki Victoris | భారతదేశంలో మిడ్-సైజ్ SUV విభాగంలో తీవ్ర పోటీ నడుస్తున్న వేళ, Maruti Suzuki తన కొత్త ఫ్లాగ్‌షిప్ Arena SUV – Victorisను ఆవిష్కరించింది. Brezza కన్నా ఎగువన నిలిచే ఈ మోడల్, Grand Vitaraకి తోడుగా Maruti Suzukiకి ఇది డబుల్ ధమాకాలా కనిపిస్తోంది. “Got It All” ట్యాగ్‌లైన్‌తో మార్కెట్‌లోకి దిగిన Victoris, 5-Star Bharat NCAP రేటింగ్, Level-2 ADAS, మల్టిపుల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు మరియు అత్యాధునిక ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇది కేవలం దేశీయ మార్కెట్‌కి మాత్రమే కాదు, 100 దేశాలకు ఎగుమతి చేయబోతున్న గ్లోబల్ కారు కూడా.
విక్టోరిస్: డిజైన్ & ఇంటీరియర్
Victorisలో డిజైన్ విభాగం e-Vitara ప్రేరణతో రూపొందించబడింది. ముందు భాగంలో స్లీక్ LED హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ టెయిల్‌ల్యాంప్స్, 17-అంగుళాల ఆలాయ్ వీల్స్, డ్యూయల్-టోన్ ఆప్షన్లతో SUV స్పోర్టీ లుక్ కల్పించింది. ఇంటీరియర్‌లో బ్లాక్-ఐవరీ డ్యుయల్ టోన్ డాష్‌బోర్డ్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-అంగుళాల SmartPlay Pro X టచ్‌స్క్రీన్, Infinity 8-స్పీకర్ డాల్బీ ఆట్మాస్ సిస్టమ్ ఉన్నాయి. అదనంగా, పానోరమిక్ సన్‌రూఫ్, గెస్చర్ కంట్రోల్ టెయిల్‌గేట్, వెంటిలేటెడ్ సీట్స్, 64-కలర్ అంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
భద్రత ప్రథమం: 5-స్టార్ రేటింగ్ + ADAS
ఎప్పుడూ భద్రతపై ప్రశ్నలు ఎదుర్కొనే Maruti Suzuki, Victorisతో తన రూట్ మార్చింది. Bharat NCAPలో 5-Star రేటింగ్ సాధించిన Victoris, స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, ABS-EBD, TPMS, హిల్ హోల్డ్ అసిస్ట్ కలిగి ఉంది.
భారతీయ మార్కెట్లో మొదటిసారిగా Arena మోడల్‌లో Level-2 ADASని Maruti అందించింది. ఇందులో:
- Adaptive Cruise Control (curve speed reductionతో)
- Lane Keep Assist
- Automatic Emergency Braking
- Blind Spot Monitor + Lane Change Alert
- Rear Cross Traffic Alert
- High Beam Assist
లాంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా 360-డిగ్రీ కెమెరా, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి భద్రతా సదుపాయాలు ఉన్నాయి.
పవర్‌ట్రెయిన్‌లు & మైలేజ్
Victorisలో రెండు ప్రధాన పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు:
- 1.5L NA పెట్రోల్ (103hp, 139Nm) → 5MT / 6AT గేర్లతో, CNG ఆప్షన్, AWD సిస్టమ్ కూడా.
- Mileage: 21.18 km/l (MT), 21.06 km/l (AT), 19.07 km/l (AWD), 27.02 km/kg (CNG).
- 1.5L Strong Hybrid (92.5hp, 122Nm) → e-CVT ట్రాన్స్మిషన్.
- Mileage: 28.65 km/l (best-in-class).
గ్లోబల్ లక్ష్యాలు
Victorisను Arena ఛానల్ ద్వారా విక్రయించబోతున్నారు. Grand Vitara Nexa డీలర్‌షిప్ ద్వారా కొనసాగుతుంది. దీంతో Maruti Suzuki రెండు వేర్వేరు సేల్స్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి మాస్ మార్కెట్ + ప్రీమియం కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటోంది.
కేవలం దేశీయంగానే కాకుండా Victorisను 100 దేశాలకు ఎగుమతి చేయాలని Maruti Suzuki ప్రణాళిక వేస్తోంది. ఇది Suzuki Motor Corporationకి భారత్ ఒక SUV ఎగుమతి హబ్‌గా మారనుందని స్పష్టంగా సూచిస్తోంది.
Maruti Suzuki Victoris, భద్రతా ప్రమాణాలు, ప్రీమియం ఫీచర్లు, మల్టిపుల్ పవర్‌ట్రెయిన్‌లతో మిడ్-సైజ్ SUV సెక్టార్‌లో కొత్త పోటీని తెచ్చింది. Hyundai Creta, Kia Seltos ఆధిపత్యాన్ని బద్దలు కొట్టాలన్న Maruti Suzuki వ్యూహంలో Victoris కీలక పాత్ర పోషించనుంది.