TATA Sierra: 1990 నుంచి 2000 వరకు ఒక ట్రెండ్ సెట్ చేసిన టాటా సియెరా కారు ఉత్పత్తని టాటా మోటర్స్ ఆ తర్వాత నిలిపివేసింది. తాజాగా ఈ వేరియంట్‌ను కొత్త హంగులతో మిగతా SUV కార్లకు గట్టి పోటీ ఇస్తూ భారత మార్కెట్‌లోకి మళ్లీ అడుగుపెట్టింది. నూతనంగా మార్కెట్‌లోకి వచ్చిన సియోరా కారు ఎలా ఉంది. దాని ధర ఎంత ఉందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. టాటా సియెరా 2025 డిజైన్ చూస్తే, పాత సియెరాను గుర్తు చేసన్తూ బాక్సీ లుక్స్‌తో అదిరిపోయేలా ఉంది. కారు ముందు భాగంలో బోల్డ్ గ్రిల్ ఇస్తూ, పూర్తి ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, స్నో ల్యాంప్స్, బోనెట్ ముందు పొడవాటి ఎల్ఈడీలైన్‌ను ఉంచారు.
సైడ్ ప్రొఫైల్‌లో పెద్ద విండోలు, గ్లాస్ బాక్స్ వీల్ ఆర్చ్‌లు, ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్, డ్యుయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇక వెనుక భాగంలో బూట్ స్పేస్ విశాలంగా ఉండటంతోపాటు డోర్‌ను చూసుకుంటే ముందు భాగంలో ఇచ్చినట్లుగానే బ్యాక్ గ్లాస్ కింది భాగంలో పొడవాటి ఎల్‌ఈడీ స్ట్రిప్‌లైట్ ఇస్తూ ఇండికేటర్లను ఉంచారు. ఇక కారు లోపల చూసినట్లైతే పొడవాటి స్క్రీన్ ఇచ్చారు. అందులో మూడు భాగాలుగా కనిపిస్తుంది. అందులో డ్రైవర్ డిస్ప్లే, సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్, కో ప్యాసింజర్ స్క్రీన్ ఉంది. ప్యానోరమిక్ సన్ రూప్‌లా వెనక కూర్చున్నవారికి మాగ్జిమమ్ స్కై కనిపిస్తుంది. డ్యుయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, అదిరిపోయే జేబీఎల్ సౌండ్ సిస్టం, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా ఉంది.
ఇన్ని హంగులతో వచ్చిన సియెరా కారులో మూడు ఇంజన్ ఫీచర్లు ఉన్నాయి. అవి 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ టర్బో, 2 లీటర్ డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. త్వరలోనే ఈవీ ఫీచర్ కూడా మార్కెట్‌లోకి రానుంది. అయితే ఈ కారు అమ్మకాలు నవంబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కారు హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేసి రూ. 12.49 లక్షల నుంచి రూ.18.09 లక్షల వరకు ఉండనుంది.
