Green SM | ఉబెర్, ఓలాకు గట్టి పోటీ.. భారత్‌లో కొత్త క్యాబ్ సర్వీస్‌లు ప్రారంభం

Green SM | ఉబెర్, ఓలాకు పోటీగా భారత్‌లోకి సరికొత్త క్యాబ్ సర్వీసెస్ వచ్చింది. వియత్నాం సంస్థ విన్ గ్రూప్‌కు చెందిన ఎలక్ట్రిక్ ట్యాక్సీ సేవల సంస్థ గ్రీన్‌ ఎస్ఎం లిమో (Limo) సేవలను ఇండియాలో ప్రారంభించింది.

Green SM | ఉబెర్, ఓలాకు పోటీగా భారత్‌లోకి సరికొత్త క్యాబ్ సర్వీసెస్ వచ్చింది. వియత్నాం సంస్థ విన్ గ్రూప్‌కు చెందిన ఎలక్ట్రిక్ ట్యాక్సీ సేవల సంస్థ గ్రీన్‌ ఎస్ఎం లిమో (Limo) సేవలను ఇండియాలో ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీసెస్ తొలి దశలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. దశలవారీగా ఇతర నగరాల్లో కూడా ఈ సేవలను విస్తరిస్తామని గ్రీన్‌ ఎస్ఎం వెల్లడించింది.

వియత్నాం, లావోస్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లో ఇప్పటికే గ్రీన్ ఎస్ఎం క్యాబ్ సర్వీసులు కొనసాగుతున్నాయి. తాజాగా భారత్‌లోనూ ఈ సేవలను గ్రీన్‌ ఎస్‌ఎం విస్తరించింది. ఈ సేవల కోసం విన్‌ఫాస్ట్ (VinFast) లిమో గ్రీన్ పేరుతో రూపొందించి 7 సీట్ల పూర్తి ఎలక్ట్రిక్ SUVలను వినియోగిస్తున్నారు. అలాగే ప్రయాణికుల వసతి కోసం ప్రతి వాహనంలోనూ తాగునీరు, వెట్ టిష్యూలు వంటి ప్రాథమిక సదుపాయాలను అందుబాటులో ఉంచనున్నట్లు సంస్థ వెల్లడించింది.

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి క్యాబ్‌లోనూ సెక్యూర్ టు సేఫ్ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు గ్రీన్ ఎస్ఎం కంపెనీ వెల్లడించింది. ఈ సెఫ్టీ ఫీచర్లలో అంతర్గత, బాహ్య కెమెరాలతో పాటు ఏఐ ఆధారిత ఫీచర్లు, ఎమర్జెన్సీ అసిస్టెన్స్ బటన్ వంటివి ఉన్నాయి. అలాగే డ్రైవర్లకు ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ, రోడ్డు భద్రత, కస్టమర్ సర్వీస్‌పై ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. రైడ్ 5 స్టార్ ప్రమాణాల ఆధారంగా ఈ క్యాబ్ సేవలను నిర్వహిస్తున్నామని కంపెనీ తెలిపింది. వాహనాల నాణ్యత, భద్రత, డ్రైవర్ ప్రవర్తన, కస్టమర్ అనుభవం వంటి అన్ని అంశాలకు ఇందులో ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది.

కస్టమర్లు తమ మొబైల్‌లో గ్రీన్ ఎస్ఎం యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఎలక్ట్రిక్ క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, యాపిల్ యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా కంపెనీ హాట్‌లైన్ నంబర్ల ద్వారా కూడా క్యాబ్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉంది. కస్టమర్ హాట్ లైన్ నంబర్ 9228853333, డ్రైవర్ హాట్‌లైన్ 9228832929 అని తెలిపింది. వీటితో పాటు గ్రీన్ ఎస్ఎం ఆపరేటింగ్ జోన్లలో నేరుగా వాహనం ఆపి కూడా క్యాబ్ సర్వీస్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

లాంచ్ ఆఫర్ కింద జూన్ 5వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. యాప్ బుకింగ్‌లపై గరిష్టంగా రూ.250 వరకు 50 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Latest News