Post Office RD Scheme | పోస్టాఫీస్‌లో సూపర్‌ సేవింగ్స్‌ స్కీమ్‌.. నెలకు రూ.1,000 పొదుపు చేస్తే..!

Post Office RD Scheme | సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయాలని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు. వారివారి ఆదాయాలకు అనుగుణంగా ఎంత పొదుపు చేయాలనేది ప్లాన్ చేసుకుంటారు. అయితే కష్టపడి సంపాదించిన డబ్బుకు సెక్యూరిటీతోపాటు వడ్డీ రావాలని ఆశించడం సర్వసాధారణం. అలాంటి వారి కోసమే ప్రభుత్వ రంగ సంస్థలు పలు పథకాలను తీసుకొచ్చాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పోస్టాఫీస్‌ రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్స్‌ గురించి.

  • Publish Date - July 2, 2024 / 11:16 AM IST

Post Office RD Scheme : సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయాలని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు. వారివారి ఆదాయాలకు అనుగుణంగా ఎంత పొదుపు చేయాలనేది ప్లాన్ చేసుకుంటారు. అయితే కష్టపడి సంపాదించిన డబ్బుకు సెక్యూరిటీతోపాటు వడ్డీ రావాలని ఆశించడం సర్వసాధారణం. అలాంటి వారి కోసమే ప్రభుత్వ రంగ సంస్థలు పలు పథకాలను తీసుకొచ్చాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పోస్టాఫీస్‌ రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్స్‌ గురించి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టాఫీస్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బుకు భద్రతతోపాటు మంచి రిటర్న్స్‌ కూడా పొందొచ్చు.

ఇలా పోస్టాఫీస్‌ అందిస్తున్న బెస్ట్‌ పథకాల్లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ ఒకటి. ఈ పథకాన్ని పలు బ్యాంకులతోపాటు పోస్టాఫీస్‌లో కూడా అందిస్తున్నారు. ఈ పథకంలో ప్రతి నెల కొంత మొత్తంలో పెట్టుబడి పెడుతూ పోతుంటే మంచి రిటర్న్స్‌ వస్తాయి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి 6.7 శాతం మేర వడ్డీ లభిస్తుంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లుగా ఉంటుంది. ఒకవేళ మెచ్యూరిటీ తర్వాత కూడా పథకాన్ని కొనసాగించాలనుకుంటే మరో ఐదేళ్లు పొడగించుకోవచ్చు. ఇందులో కనీసం రూ.100 నుంచి గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు.

ఉదాహరణకు ఈ పథకంలో నెలకు రూ.1000 చొప్పున జమ చేస్తుంటే ఎంత ఆదాయం పొందుతారో తెలుసుకుందాం. మీరు నెలకు రూ.1000 చొప్పున సేవ్‌ చేస్తూ వెళ్తే ఐదేళ్ల తర్వాత వడ్డీతోపాటు రూ.71 వేలు అవుతాయి. అంటే ఐదేళ్ల తర్వాత చేతికి రూ.71 వేలు అందుతాయి. అలాగే మీరు ఈ స్కీమ్‌ను మరో 5 ఏళ్లపాటు నెలకు రూ.1000 జమచేస్తూ వెళ్తే పదేళ్ల తర్వాత మీరు జమచేసిన మొత్తం రూ.1.20 లక్షలు అవుతుంది. దానిపై వడ్డీ దాదాపు రూ.50 వేలు వస్తుంది. అంటే మీ చేతికి మొత్తంగా రూ.1.70 లక్షలు అందుతాయి.

Latest News