RBI Silver Loans| గోల్డ్ లోన్లతో పాటు ఇక సిల్వర్ లోన్లు కూడా : ఆర్బీఐ కీలక ప్రకటన

ఇప్పటిదాక బంగారాన్ని తాకట్టు పెట్టి మాత్రమే బ్యాంకు రుణాలు పొందే వసతి రుణ గ్రహితలకు అందుబాటులో కొనసాగుతుంది. అయితే గోల్డ్ లోన్స్ మాదిరిగానే ఇక మీదట వెండి పై కూడా రుణాలు తీసుకోవచ్చని ఆర్బీఐ చేసిన ప్రకటన వైరల్ గా మారింది. వెండి రుణాల కోసం కొత్త మార్గదర్శకాలు 1 ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలిపింది.

విధాత : ఇప్పటిదాక బంగారాన్ని తాకట్టు పెట్టి మాత్రమే బ్యాంకు రుణాలు(Gold Loans) పొందే వసతి రుణ గ్రహితలకు అందుబాటులో కొనసాగుతుంది. అయితే గోల్డ్ లోన్స్ మాదిరిగానే ఇక మీదట వెండి(Silver)పై కూడా రుణాలు(Loans) తీసుకోవచ్చని ఆర్బీఐ(RBI) చేసిన ప్రకటన వైరల్ గా మారింది. ఇంట్లో వెండి ఆభరణాలు లేదా నాణేలు ఉంటే వాటిపై లోన్ తీసుకోవచ్చు. బ్యాంకులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలు బంగారు రుణాలలాగానే వెండి ఆభరణాలు, నాణేలను తాకట్టు పెట్టి రుణాలు ఇవ్వడానికి వీలు కల్పిస్తూ ఆర్బీఐ లోన్ నియమాలను అధికారికంగా సవరించింది. వెండి రుణాల కోసం కొత్త మార్గదర్శకాలు 1 ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అన్ని వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు ఇతర సంస్థల ద్వారా కస్టమర్లు వెండి తాకట్టుపై రుణ సౌకర్యాన్ని పొందవచ్చు.

10కిలోల వరకు వెండిని తాకట్టు రుణాలు

ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం వెండి లోన్ పొందడానికి 10 కిలోల వరకు వెండి తాకట్టు పెట్టొచ్చు. ప్రస్తుతం, బంగారు రుణాల కోసం 1 కిలో వరకు బంగారాన్ని తాకట్టు పెట్టవచ్చు. బంగారు ఆభరణాలు 50గ్రాములకు మించరాదు. వెండి ఆభరణాలు 10కిలో గ్రాములకు, వెండి నాణేలు 500గ్రాములకు మించరాదు. 2.5 లక్షల విలువైన వెండిని తాకట్టు పెడితే దాని విలువలో 85 శాతం వరకు లోన్ పొందవచ్చు. 5 లక్షల విలువైన వెండికి లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తి 75 శాతానికి పరిమితం చేయబడుతుంది. లోన్ మొత్తం కట్టిన తర్వాత బ్యాంకులు లేదా ఎన్ బీఎఫ్ సీలు తాకట్టు పెట్టిన వెండిని రుణగ్రహితలకు ఏడు రోజుల్లో తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వకపోతే రోజుకు రూ. 5,000 జరిమానా పడుతుంది. లోన్ తీసుకొని తిరిగి కట్టకపోతే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలు రుణ గ్రహితలు తనఖా పెట్టిన వెండి లేదా వెండి ఆభరణాలను అమ్మి లోన్ మొత్తం డబ్బు రికవరీ చేసే హక్కు ఉంటుందన్న సంగతి తెలిసిందే.