Udaypur | విజయ్–రష్మిక రాయల్ వెడ్డింగ్ సందడి.. ఉదయ్‌పూర్‌కి చేరుకుంటున్న సెల‌బ్రిటీలు

Udaypur | స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రాయల్ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఉదయ్‌పూర్ ముస్తాబైంది. ఇప్పటికే ఇరు కుటుంబాల సభ్యులు రాజస్థాన్ చేరుకోగా, ఇప్పుడు టాలీవుడ్‌కు చెందిన సన్నిహితులు వరుసగా అక్కడికి చేరుకుంటున్నారు.

Udaypur | స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రాయల్ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఉదయ్‌పూర్ ముస్తాబైంది. ఇప్పటికే ఇరు కుటుంబాల సభ్యులు రాజస్థాన్ చేరుకోగా, ఇప్పుడు టాలీవుడ్‌కు చెందిన సన్నిహితులు వరుసగా అక్కడికి చేరుకుంటున్నారు. తాజాగా ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా, ప్రముఖ సెలబ్రిటీ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ ల్యాండ్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లగేజ్‌తో ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న వీరి విజువల్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.

విజయ్ దేవరకొండ కెరీర్‌లో కీలక మలుపు తిప్పిన చిత్రం పెళ్లి చూపులు. ఈ సినిమాను తెరకెక్కించిన తరుణ్ భాస్కరే విజయ్‌కు హీరోగా తొలి బ్రేక్ ఇచ్చారు. ఆ సినిమా విజయంతోనే విజయ్ స్టార్‌డమ్ వైపు అడుగులు వేశారు. ఇప్పుడు తన పెళ్లి వేడుకకు అదే దర్శకుడు హాజరుకావడం వీరిద్దరి మధ్య ఉన్న ప్రత్యేక బాండింగ్‌ను చూపిస్తోంది. ఇక శ్రావ్య వర్మ టాలీవుడ్‌లో అనేక టాప్ స్టార్స్‌కు స్టైలిస్ట్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, గుడ్ లక్ సఖి చిత్రంతో నిర్మాతగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె కూడా ఈషా రెబ్బాతో కలిసి ఒకేసారి ఉదయ్‌పూర్ చేరుకోవడంతో పెళ్లి వేడుకకు మరింత గ్లామర్ జోడైంది.

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, శ్రావ్య వర్మల రాకతో టాలీవుడ్ నుంచి ఇంకెవ‌రెవ‌రు ఈ రాయల్ వెడ్డింగ్‌కు హాజరవుతారో అన్న ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. మరికొన్ని గంటల్లోనే మిగ‌తా స్టార్స్ ఎయిర్‌పోర్ట్ విజువల్స్ బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రీ-వెడ్డింగ్ వేడుకల ఫోటోలు, వీడియోల కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కళ్లప్పగించి ఎదురుచూస్తున్నారు. ఉదయ్‌పూర్‌లో ఈ స్టార్ వెడ్డింగ్ వేడుక మరింత గ్రాండ్‌గా సాగనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Latest News