ఎగ్జిట్ పోల్స్ జోష్ తో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఊహించినట్లుగానే సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ లో దూసుకెళ్లింది.

  • Publish Date - June 3, 2024 / 10:45 AM IST

విధాత: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఊహించినట్లుగానే సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ లో దూసుకెళ్లింది. నిఫ్టీ 600 పాయింట్ల లాభం అందుకుంది. ఉదయం 9:30 కల్లా సెన్సెక్స్ 2000 పాయింట్లు లాభంతో 76,738 గరిష్ట ట్రేడ్ నమోదు చేసింది. నిఫ్టీ 613 పాయింట్ల వద్ద లాభపడి 24,144కు చేరుకుంది. రెండు సూచీలు కూడా ఆరంభంలోనే రికార్డు గరిష్టాలను నమోదు చేయడం విశేషం. సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83 వద్ద ప్రారంభమైంది.

Latest News