విధాత,వాషింగ్టన్: విండోస్ వినియోగదారులంతా తమ కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ కోరింది. ఆపరేటింగ్ సిస్టమ్‌లో తీవ్ర లోపం బయటపడటమే ఇందుకు కారణమని తెలిపింది. ఆ లోపాన్ని ఉపయోగించుకుంటూ హ్యాకర్లు డేటా చోరీకి తెగబడే ముప్పుందని హెచ్చరించింది.దాన్ని నివారించేందుకు ఓ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది. సాధారణంగా ఒకే ప్రింటర్‌ను ఎక్కువమంది ఉపయోగించుకునేందుకు విండోస్‌లో ‘ప్రింట్ స్పూలర్’ ఉపయోగపడుతుంది. అందులో భద్రత పరమైన లోపాలున్నట్లు తాము గుర్తించామని సాంగ్‌ఫర్ అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ పరిశోధకులు ఈ ఏడాది మేలో తెలిపారు. దాన్ని ఎలా హ్యాక్ చేయొచ్చన్న వివరాలను పొరపాటున వారు ఆన్‌లైన్‌లో ప్రచురించారు. వెంటనే డిలీట్ చేసినప్పటికీ.. ఆ లోపే కొన్ని డెవలపర్ సైట్లలోకి సదరు సమాచారం చేరింది. ‘ప్రింట్‌నైట్‌మేర్’గా పిలుస్తున్న ఈ లోపాన్ని ఉపయోగించుకొని హ్యాకర్లు వివిధ ప్రోగ్రామ్‌లను ఇతరుల కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేసే ముప్పుందని తెలిపింది.
కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. మైక్రోసాఫ్ట్
<p>విధాత,వాషింగ్టన్: విండోస్ వినియోగదారులంతా తమ కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ కోరింది. ఆపరేటింగ్ సిస్టమ్‌లో తీవ్ర లోపం బయటపడటమే ఇందుకు కారణమని తెలిపింది. ఆ లోపాన్ని ఉపయోగించుకుంటూ హ్యాకర్లు డేటా చోరీకి తెగబడే ముప్పుందని హెచ్చరించింది.దాన్ని నివారించేందుకు ఓ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది. సాధారణంగా ఒకే ప్రింటర్‌ను ఎక్కువమంది ఉపయోగించుకునేందుకు విండోస్‌లో ‘ప్రింట్ స్పూలర్’ ఉపయోగపడుతుంది. అందులో భద్రత పరమైన లోపాలున్నట్లు తాము గుర్తించామని సాంగ్‌ఫర్ అనే సైబర్ సెక్యూరిటీ […]</p>
Latest News

‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !
వానల కోసం గాడిదలకు పెళ్లి!