Actor Ram Pothineni turns lyricist | పాట రాసిన హీరో రామ్‌.. ‘నువ్వుంటే చాలే’ విడుదల

‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ సినిమాకు పాట

విధాత : హీరో రామ్‌ తనలోని మరో కోణాన్ని సినీ ప్రేక్షకులకు పరిచయం చేశారు. తాను నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’(Andhra King Taluka) సినిమా కోసం గేయ రచయితగా మారి ఓ ప్రేమ గీతాన్ని రాశారు. “ఒక చూపుతో నాలోనే పుట్టిందే…అంటూ సాగే ఆ సాంగ్‌ లిరికల్‌ వీడియో శుక్రవారం విడుదలైంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌(Anirudh Ravichander) పాడిన ఈ పాటకు వివేక్‌, మెర్విన్‌ సంగీతం అందించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాకు పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. సాధారణంగా హీరోలు పాటలు పాడడం చూశాం..రాయడం మాత్రం చాలా అరుదు.
హీరో రామ్ తొలిసారిగా పాట రాసినప్పటికి పాటలోని సాహిత్యం ఆయనకు ఈ రంగంలో అనుభవం ఉన్నట్లుగా సాగింది. పాటలోని పదాల పొందిక చూస్తే తనలోని భావకుడిని, ప్రేమికుడిని బయటపెట్టి సాహితీ ప్రియులను మెప్పించేలా ఉంది. మరోవైపు ఈ సినిమా షూటింగ్ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే తో రామ్ ప్రేమలో పడ్డాడని..ఆమెను తలచుకునే ఈ పాట రాసాడన్న ప్రచారం కూడా వినిపిస్తుంది.

హీరో రామ్ రాసిన పాట సాహిత్యంలోకి వెళితే…
“ఒక చూపుతో నాలోనే పుట్టిందే
ఏదో వింతగా గుండెల్లో చేరిందే
నివ్వు ఎవ్వరో నాలోనే అడిగానే
తానేగా ప్రేమని తెలిపిందే
పరిచయం లేదని అడిగా
ప్రేమంటే కలిశాంగా
ఇకపై మనమేగా అందే
వెతికిన దొరకని అర్థం ప్రేమదే
అది నీకేంటో ఒక మాటలో చెప్పాలే
నువ్వుంటే చాలే.. “ అంటూ రసాత్మకంగా సాగింది.