విధాత : నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu )తెరకెక్కిస్తున్న ‘అఖండ 2 (Akhanda 2)తాండవం’ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది. అఖండ 2’ బిగ్ రివీల్ పేరిట చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ‘అఖండ 2’ చిత్రాన్ని 3డీలోనూ రిలీజ్(3D release) చేయనున్నట్టు ప్రకటించింది. భారతీయ చిత్ర పరిశ్రమలోనే గొప్ప అనుభూతి పంచే సినిమాల్లో ఇదొకటి కానుందని టీమ్ పేర్కొంది.
‘అఖండ 2’ అప్డేట్స్ ను మీడియా సమావేశంలో బోయపాటి శ్రీను వెల్లడించారు. బాలకృష్ణ అభిమానులు, ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే సినిమాని 3డీ ఫార్మాట్‌లోనూ తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ చిత్రం.. భారతదేశ ఆత్మ, పరమాత్మ. ఈ సినిమా మన దేశ ధర్మం, ధైర్యం. ప్రపంచ దేశాల్లో మతం కనిపిస్తుంది. కానీ, ఈ దేశంలో మాత్రమే సనాతన ధర్మం కనిపిస్తుందన్నారు. దాని ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమే అఖండ 2 అని పేర్కొన్నారు. ఈ సినిమాని దేశమంతా చూడాలనుకుంటున్నామని.. అందుకే కొన్ని రోజుల క్రితం ప్రచారాన్ని ముంబయి నుంచి ప్రారంభించాం అని తెలిపారు.
గతంలో వచ్చిన హిట్ మూవీ ‘అఖండ’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘అఖండ 2 తాండవం’ మూవీ డిసెంబరు 5న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
