Gatha Vaibhavam : గత జన్మల కథల సినిమాలతో నాన్న, నేను హిట్ లు కొట్టాం : నాగార్జున

‘గత జన్మల కథలతో నాన్న, నేను హిట్ కొట్టాం’ అన్నారు నాగార్జున. ‘గత వైభవం’ మూవీ విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.

Gatha Vaibhavam Pre-release event

విధాత: గత జన్మల నేపథ్యంతో సాగే కథలతో మా నాన్న అక్కినేని నాగేశ్వర్ రావు ‘మూగ మనసులు’ సినిమాతో, నేను ‘జానకి రాముడు’ తో మంచి హిట్ లు కొట్టామని..తనకు ఇలాంటి కథలు అంటే ఇష్టమని, ఆ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న చిత్రమే ‘గత వైభవం’ అని ప్రముఖ నటుడు నాగార్జున తెలిపారు. గత వైభవం మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు ముఖ్యఅతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ ఈ సినిమా విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. మూవీ ట్రైలర్ చూస్తే ఈ సినిమా కోసం టీమ్‌ ఎంతగా కష్టపడిందో తెలుస్తుందన్నారు. నాలుగుతరాల కథ .. ‘గత వైభవం’సినిమా గురించి ఆషిక రంగనాథ్ ఎప్పటినుంచో నాకు చెబుతూ వస్తుందన్నారు. అషికా టాలెంటెడ్ హీరోయిన్ అని..తొలి సినిమా కావడంతో దుష్యంత్‌ టెన్షన్‌ ఊహించగలనంటూ నాగార్జున చెప్పుకొచ్చారు.

ఆషిక మాట్లాడుతూ గత జన్మలు. ఫాంటసీల బ్యాక్‌డ్రాప్‌ చిత్రాల్లో నేను ఇంతకుముందు నటించలేదు అని.. దేవకన్య పాత్ర కోసం ఆభరణాలు ధరించి, యాక్ట్‌ చేయడం సవాల్ గా భావించానన్నారు. హీరో దష్యంత్ మాట్లాడుతూ రొటీన్‌కు భిన్నంగా తొలి ప్రయత్నంలోనే ఫాంటసీ మూవీలో నటించానని, రాజకీయ నేపథ్య కుటుంబమైనా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనుకుంటానని పేర్కొన్నారు. సునీల్‌ కుమార్‌ తెరకెక్కించిన ‘గత వైభవం’ చిత్రం ఈనెల 14న విడుదల కానుంది. అదే రోజున నాగార్జున ‘శివ’ మూవీ రీ రిలీజ్‌ కానుండటం విశేషం.