Sitara Ghattamaneni| ఫేక్ అకౌంట్స్ పై మహేశ్ బాబు కూతురు సితార ఫైర్!

విధాత : సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(Mahesh Babu) కూతురు సితార ఘట్టమనేని(Sitara Ghattamaneni) తన పేరుతో సోషల్ మీడియా(Social media)లో చలామణి అవుతున్న నకిలీ ఖాతాల(Fake Accounts) పై తీవ్రంగా స్పందించారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్(Instagram) ఖాతాలో పోస్ట్ పెట్టింది. ‘నా పేరు మీద అనేక నకిలీ, స్పామ్ ఖాతాలు క్రియేట్‌ చేస్తున్నట్లుగా నేను గమనించాను. నేను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటాను. ఇది మాత్రమే […]

విధాత : సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(Mahesh Babu) కూతురు సితార ఘట్టమనేని(Sitara Ghattamaneni) తన పేరుతో సోషల్ మీడియా(Social media)లో చలామణి అవుతున్న నకిలీ ఖాతాల(Fake Accounts) పై తీవ్రంగా స్పందించారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్(Instagram) ఖాతాలో పోస్ట్ పెట్టింది. ‘నా పేరు మీద అనేక నకిలీ, స్పామ్ ఖాతాలు క్రియేట్‌ చేస్తున్నట్లుగా నేను గమనించాను. నేను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటాను. ఇది మాత్రమే నా అఫీషియల్‌ అకౌంట్‌. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నా పేరుతో ఉన్న అకౌంట్స్‌తో జాగ్రత్తగా ఉండండి’ అంటూ సితార సూచించింది. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరు కూడా ఈ విషయాన్ని గమనించి నకిలీ ఖాతాలకు దూరంగా ఉండాలని సూచించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో తప్ప ఇతర ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా అఫీషియల్‌ అకౌంట్‌ నాకు లేదని సితార స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న సితార ఇన్‌స్టాగ్రామ్‌లో తన కుటుంబం, వ్యక్తిగత అప్‌డేట్స్, బ్రాండ్స్‌తో తన కొలాబరేషన్స్ గురించి తరచూ అప్‌డేట్‌లు పోస్ట్ చేస్తు అభిమానులతో టచ్ లో ఉంటున్నారు.