విధాత : రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నాగార్జున, అమీర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శృతి హాసన్ వంటి స్టార్స్ నటించిన కూలీ సినిమా ఈనెల 14న విడుదల కానుంది. ఇప్పటికే కూలీ సినిమా విడుదలకు ముందే హిట్ టాక్ తెచ్చుకుని భారీ అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమా ఎంతమేరకు హిట్ అవుతుంది..ఎన్ని వందల కోట్లు సాధిస్తుందన్న అంచనాలు పక్కన పెడితే…ఈ సినిమాకు సీక్వెల్ గా పార్ట్ 2 కూడా ఉండబోతుందన్న సమాచారం హాట్ టాపిక్‌గా మారింది. సంగీత దర్శకుడు అనిరుధ్ కూలీ పార్ట్2 లో కలుద్దాం అంటూ పెట్టిన పోస్టుతో సినిమాకు పార్ట్2 ఉంటుందని తేలిపోయింది. సినిమా అద్భుతంగా వచ్చిందని.. మనం కూలీ పార్ట్ 2 కోసం తిరిగి కలుస్తామని ఆశిస్తున్నానని అనిరుధ్ పోస్టు చేశారు. అయితే కూలీ పార్టీ 2పై దర్శక నిర్మాతలు, హీరో రజనీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కూలీ పార్ట్ 2పై దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా మాస్టర్ 2, లియో 2 తీసేందుకు ఆసక్తిగా ఉన్నారని సమాచారం.
coolie | రజనీకాంత్ కూలీ పార్ట్2 ఉందా!
రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నాగార్జున, అమీర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శృతి హాసన్ వంటి స్టార్స్ నటించిన కూలీ సినిమా ఈనెల 14న విడుదల కానుంది

Latest News
నికోబార్ లో కేంద్రం పర్యావరణ విధ్వంసం : రాహుల్ గాంధీ ట్వీట్
80 హిప్పోల ప్రాణదాత..అనంత్ అంబానీ!
ప్రియుడి మూవీ ఈవెంట్లో కన్నీళ్లు పెట్టుకున్న పాయల్ రాజ్‌పుత్..
పెరిగిన బంగారం ధరలు..!
అషురెడ్డి కేసులో ఆడియో లీక్‌తో కీలక మలుపు
తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో భారీ వర్షాలు..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
స్ట్రీట్ కాజ్ ఎన్జీఓకు కేటీఆర్ ₹17 లక్షల విరాళం.. యువతతో మమేకం
రూ.59,999కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. జెలియో నుంచి 2026 గ్రేసీ లాంచ్!
అనవసరపు కొనుగోళ్లు వద్దు.. రాష్ట్రంలో సమృద్ధిగా పెట్రోల్, డీజిల్ నిల్వలు