Zelio Gracy Scooter | ప్రముఖ ఈవీ వాహనాల తయారీ సంస్థ జెలియో ఈ మొబిలిటీ తన కొత్త గ్రేసీ 2026 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన రైడ్ ఏసియా ఈవీ ఎక్స్‌పో 2026లో ఈ వేరియంట్‌ను విడుదల చేసింది. కాలేజీ విద్యార్థులు, యూత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ స్కూటర్‌ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.
ధర ఎంతంటే..!
జెలియో గ్రేసీ 2026 స్కూటర్ ప్రారంభ ధరను రూ.59,999గా నిర్ణయించింది. తక్కువ వేగం గల ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఇది విలువైన ఆఫర్‌గా నిలుస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక ప్రారంభ ఆఫర్ కింద తొలి 500 మంది కొనుగోలుదారులకు ఉచితంగా సేఫ్టీ హెల్మెట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది.
బ్యాటరీ, రేంజ్ ఎలా ఉన్నాయి?
ఈ స్కూటర్ గరిష్ఠంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 60-120 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇందులో 50 లీటర్ల బూట్ స్పేస్ ఉండటం విశేషం. అంతేకాకుండా ఈ స్కూటర్ నాలుగు విభిన్న బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది.
ఈ ఎంపికల్లో రెండు లీడ్ యాసిడ్ బ్యాటరీ వేరియంట్లతో పాటు మరో రెండు లిథియం అయాన్ బ్యాటరీ (60V/32AH), 72V/32AH) ఎంపికలు ఉన్నాయి. లీడ్ యాసిడ్ వేరియంట్లు 8-10 గంటలు, లిథియం అయాన్ వేరియంట్లు 4-5 గంటల్లో పూర్తి చార్జ్ అవుతాయి.
ఫీచర్లు ఇవీ..!
ఈ స్కూటర్‌కు 60/72V BLDC మోటార్‌ను అందించారు. బ్రేకింగ్ వ్యవస్థలో భాగంగా ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. ముందు టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్, వెనుక స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ ఉన్నాయి. అదనంగా సెంట్రల్ లాకింగ్, యాంటీ థెఫ్ట్ అలారం, USB చార్జింగ్ పోర్టు, ఫుట్‌రెస్ట్, కీలెస్ డ్రైవ్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డిజిటల్ మీటర్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మోటార్, కంట్రోలర్ ఫ్రేమ్‌పై రెండు సంవత్సరాల వారంటీ లభిస్తుంది.
కలర్ ఆప్షన్లు
జెలియో కంపెనీ ఏడు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చింది. ఇందులో స్నో పెర్ల్ వైట్, బ్రైట్ బ్లాక్, ఏషియన్ బ్లాక్, ఎల్లో, నోబుల్ మెటల్ గ్రే, ఫ్లోరోసెంట్ గ్రీన్, హిబస్కస్ పర్‌పుల్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.
Read More:
కొత్త బెంజ్ ఈవీ కారు లాంచ్.. సింగిల్ చార్జింగ్‌తో హైదరాబాద్ నుంచి ముంబై వరకు వెళ్లొచ్చు!
350cc ఇంజిన్‌తో డ్యూక్ బైక్‌లు లాంఛ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!
