విధాత : గ్రేట్ నికోబార్‌లో కేంద్ర ప్రభుత్వం అభివృద్ది ముసుగులో వేల ఏళ్ల నాటి అడవులను నరికివేస్తూ.. పర్యావరణ విధ్వంసం చేస్తుందని లోక్ సభ కాంగ్రెస్ పక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటించిన రాహుల్‌గాంధీ క్యాంప్‌బెల్ బే ప్రాంతానికి వెళ్లి గిరిజన నేతలతో భేటీ అయ్యారు. గ్రేట్ నికోబార్ ప్రాంతంలో కేంద్రం భారీస్థాయిలో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులపై వారి అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రేట్ నికోబార్ లో పర్యటించిన రాహుల్ గాంధీ అక్కడి పరిస్థితులపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నికోబార్ జరుగుతున్నది మన జీవితకాలంలో ఈ దేశ సహజ, గిరిజన వారసత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న అతిపెద్ద కుంభకోణం, అత్యంత ఘోరమైన నేరాలలో ఒకటిగా పేర్కొన్నారు. ఇది అభివృద్ధి కాదు..ఇది అభివృద్ధి అనే ముసుగులో జరుగుతున్న విధ్వంసం అని ఆరోపించారు.
నా జీవితంలో నేను చూసిన అత్యంత అసాధారణమైన అడవులు ఇవి అని, జ్ఞాపకాలకు అందని పురాతనమైన చెట్లు. పెరగడానికి తరతరాలు పట్టిన అడవులకు గ్రేట్ నికోబార్ నెలవు అని గుర్తు చేశారు.
ఈ ద్వీపంలోని ప్రజలు కూడా అంతే అందంగా ఉంటారు అని, ఆదివాసీ సమాజాలు, వలసదారులు ఇద్దరూ నివసిస్తున్నారని.. కానీ వారికి చట్టబద్ధంగా దక్కాల్సిన వాటిని దోచుకుంటున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం ఇక్కడ అభివృద్ది పేరుతో చేస్తున్న దానిని గ్రేట్ నికోబార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (GNI) “ప్రాజెక్ట్” అని పిలుస్తుందని..కాని నేను చూసింది ప్రాజెక్ట్ కాదు అని.. అది గొడ్డలి వేటుకు గురైన లక్షలాది చెట్లు అని తెలిపారు. ప్రాజెక్టు పేరుతో 160 చదరపు కిలోమీటర్ల వర్షారణ్యం నాశం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి స్థానికుల ఇళ్లను లాక్కుంటూ, ప్రజలను నిర్వాసితులను చేస్తూ…వారి సమస్యలను, సహాయ, పునరావాసాలను పట్టించుకోకుండా పర్యావరణాన్ని, ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఇదంతా ఒకే ఒక్క వ్యాపారవేత్త అయిన అదానీ ప్రయోజనం కోసం సాగుతుందని, ఇది అభివృద్ధి కాదు. ఇది మారువేషంలో ఉన్న విధ్వంసం. మన కాలంలోని అతిపెద్ద పర్యావరణ, సామాజిక ద్రోహాలలో ఇది ఒకటిగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. నేను చూసినదాన్ని భారతీయులు కూడా చూడాలని ఎంచుకుంటే ఈ విధ్వంసాన్ని ఆపేందుకు ముందుకొచ్చి పోరాడాలని సూచించారు. నేను చూసినదాన్ని భారతీయులు కూడా చూడాలని ఎంచుకుంటే ఈ విధ్వంసాన్ని ఆపేందుకు ముందుకొచ్చి పోరాడాలని సూచించారు.
రాహుల్ గాంధీ తన పర్యటనలో భాగంగా భారతదేశ దక్షిణ చివరి భూభాగం అయిన గ్రేట్ నికోబార్ ద్వీపంలోని లైట్‌హౌస్‌ను రాహుల్ గాంధీ సందర్శించారు. 1984లో ప్రధాని హోదాలో ఇందిరా గాంధీ ఇక్కడ పర్యటించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, 42 ఏళ్ల తర్వాత అదే చోట నిలబడటం గర్వంగా ఉందన్నారు. భారతదేశ వైవిధ్యం, సముద్ర తీరాల సౌందర్యం అద్భుతమని ఆయన కొనియాడారు. ఇందిరా గాంధీ తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించిన ప్రధాన నేతగా రాహుల్ నిలిచారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఇందిరా స్మారక విగ్రహం వద్ద నివాళులు అర్పించారు.
I travelled through Great Nicobar today.
These are the most extraordinary forests I have ever seen in my life. Trees older than memory. Forests that took generations to grow.
The people on this island are equally beautiful – both the adivasi communities and the settlers – but… pic.twitter.com/vYdBWdYfIJ
— Rahul Gandhi (@RahulGandhi) April 29, 2026
