Vivo Y600 Pro | 10,200mAh భారీ బ్యాటరీతో వివో స్మార్ట్‌ఫోన్.. చైనాలో లాంచ్, ధర ఎంతంటే..!

Vivo Y600 Pro | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో కొత్తగా Vivo Y600 Pro మొబైల్‌‌ను చైనాలో విడుదల చేసింది. 10,200mAh భారీ బ్యాటరీతో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది.

Reported by: Chandram | సైన్స్​ – టెక్నాలజీ | Apr 28, 2026, 10:24 pm IST
Read Time: 4 mins
Vivo Y600 Pro | 10,200mAh భారీ బ్యాటరీతో వివో స్మార్ట్‌ఫోన్.. చైనాలో లాంచ్, ధర ఎంతంటే..!

Vivo Y600 Pro | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో సరికొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. వై సిరీస్‌లో కొత్తగా Vivo Y600 Pro మొబైల్‌‌ను చైనాలో విడుదల చేసింది. 10,200mAh భారీ బ్యాటరీతో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చిన ఈ మొబైల్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటుంది.

బ్యాటరీనే పెద్ద హైలైట్

Vivo Y600 Pro మొబైల్‌లో బ్యాటరీనే పెద్ద హైలైట్‌గా చెప్పొచ్చు. ఇందులో 10,200mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని అందించారు. ఇది 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం 5G, Wifi6, Bluetooth 5.4, USB Type C వంటి సదుపాయాలు ఉన్నాయి.

స్పెసిఫికేషన్లు

ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.83 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్, HDR సపోర్టుతో వస్తుంది. DCI-P3 కలర్ గ్యామట్, 1.07 బిలియన్ కలర్స్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే IP68, IP69 రేటింగ్‌తో దుమ్ము, నీటి నిరోధకతను కలిగి ఉంది.

పనితీరు విషయానికి వస్తే.. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300e ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. గరిష్టంగా 12GB LPDDR5 ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజ్ వరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS6పై పనిచేస్తుంది.

కెమెరా ఫీచర్లు

ఫొటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా.. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 32మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. దీంతో 1080p వరకు వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

ధర ఎంతంటే..

Vivo Y600 Pro ప్రారంభ ధర 2,099 చైనీస్ యువాన్లుగా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.29 వేలు. 8GB ర్యామ్+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32వేలు కాగా, 8GB ర్యామ్+512GB స్టోరేజ్, 12GB ర్యామ్ +256GB స్టోరేజ్ వేరియంట్ల ధరలను రూ.36వేలుగా ఖరారు చేశారు. ఇక టాప్ ఎండ్ 12 జీబీ ర్యామ్+512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.40వేలుగా ఉంది.

చైనాలో మే 5వ తేదీ నుంచి ఈ ఫోన్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. Bright Moon Black, Floating Gold, Star Violet, Vast Blue వంటి నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. మరి ఈ మొబైల్ భారత మార్కెట్‌లో ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి!

Read More:

గేమింగ్ లవర్స్‌కు ఇన్‌ఫినిక్స్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో GT 50 Pro లాంచ్

8000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో రియల్‌మీ కొత్త మొబైల్.. రూ.15వేలలోనే ధర!