Realme C100x | 8000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో రియల్‌మీ కొత్త మొబైల్.. రూ.15వేలలోనే ధర!

Realme C100x | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ నుంచి మరో కొత్త మొబైల్ రాబోతుంది. ఇటీవల యూరప్‌లోని సర్టిఫికేషన్ డేటాబేస్‌లో కనిపించిన Realme C100x త్వరలోనే భారత్‌లో కూడా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

Reported by: Chandram | సైన్స్​ – టెక్నాలజీ | Apr 24, 2026, 11:24 pm IST
Read Time: 4 mins
Realme C100x | 8000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో రియల్‌మీ కొత్త మొబైల్.. రూ.15వేలలోనే ధర!

Realme C100x | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ నుంచి మరో కొత్త మొబైల్ రాబోతుంది. ఇటీవల యూరప్‌లోని సర్టిఫికేషన్ డేటాబేస్‌లో కనిపించిన Realme C100x త్వరలోనే భారత్‌లో కూడా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్లో విడుదలైన కొద్దిరోజుల తర్వాత ఇది భారత మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని లీకుల ద్వారా తెలుస్తోంది.

ప్రముఖ టెక్ బ్లాగర్ పరాస్ గుగ్లానీ వెల్లడించిన వివరాల ప్రకారం.. Realme C100xలో 8000mAh భారీ బ్యాటరీ ఉండనుంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు చేస్తుంది. ముందుగా ఈ మొబైల్ 7500mAh బ్యాటరీతో వస్తుందని ప్రచారం జరిగింది. కానీ తాజా లీకుల ప్రకారం బ్యాటరీ సామర్థ్యం పెరిగినట్లు తెలుస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. డీప్‌బ్లూ టైడ్, గోల్డెన్ కోస్ట్ అనే రంగుల్లో ఈ మొబైల్ వస్తుంది. అలాగే 6జీబీ ర్యామ్+128జీబీ, 6జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ విక్రయానికి వచ్చే అవకాశం ఉందని లీకుల ద్వారా తెలుస్తోంది.

డిజైన్ పరంగా చూస్తే ఈ మొబైల్ వెనుక భాగంలో పిల్ ఆకారంలో డ్యూయల్ కెమెరా మాడ్యూల్ కనిపిస్తోంది. కెమెరా సెటప్ పక్కనే ఎల్‌ఈడీ ఫ్లాష్ కూడా ఉండనుంది. ఇక ఫోన్ కుడి వైపు పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇందులో 6.7 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్ ఉండే అవకాశం ఉంది. ముందు భాగంలో ఫ్లాట్ డిస్‌ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్‌తో స్తుంది. స్క్రీన్ చుట్టూ కొద్దిగా మందమైన బెజెల్స్ కనిపిస్తున్నాయి. ఈ ఫోన్‌లో NFC సపోర్టు కూడా ఉండొచ్చని సమాచారం. ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI7.0తో రానున్నట్లు తెలుస్తోంది.

ధర పరంగా చూస్తే.. ఇది మార్కెట్‌లో రూ.10 వేల నుంచి 15 వేల మధ్యలో ఉండే అవకాశం ఉందని లీకుల ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌లో గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Read More:

రూ.10 వేల ధరలోనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు.. 6300mAh బ్యాటరీతో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లు!

వన్‌ప్లస్ నార్డ్ CE 6 లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..!