Infinix GT 50 Pro | గేమింగ్ లవర్స్‌కు ఇన్‌ఫినిక్స్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో GT 50 Pro లాంచ్
Infinix GT 50 Pro | గేమింగ్ ప్రియుల కోసం ఇన్‌ఫినిక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌నున తీసుకొచ్చింది. Infinix GT 50 Pro మోడల్‌ను గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదల చేసింది.
Infinix GT 50 Pro | గేమింగ్ ప్రియుల కోసం ఇన్‌ఫినిక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌నున తీసుకొచ్చింది. Infinix GT 50 Pro మోడల్‌ను గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. గత ఏడాది వచ్చిన GT 30 Pro మోడల్‌కు అప్‌గ్రేడెడ్‌గా వచ్చిన ఈ ఫోన్‌లో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో పాటు హైడ్రో ఫ్లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంది. అలాగే గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన షోల్డర్ ట్రిగ్గర్స్ వంటి ఫీచర్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
డిస్‌ప్లే
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల AMOLED LTPS 1.5K డిస్‌ప్లే ఉంది. 144Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్‌పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో స్క్రీన్ మరింత బలంగా ఉంటుంది. దీనికి TÜV Low Blue Light సర్టిఫికేషన్ కూడా ఉండటం గమనార్హం.
ఈ మొబైల్‌లో 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ చిప్‌సెట్ ఉంది. అలాగే Mali-G720 MC GPU, 12GB LPDDR5x RAM ఉన్నాయి. ఈ ఫోన్ గరిష్టంగా 512జీబీ UFS 4.1 స్టోరేజ్ సపోర్టు చేస్తుంది. ఇక ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOSపై పనిచేస్తుంది.
కెమెరా ఫీచర్లు
ఫొటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా (OIS) , 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.
గేమింగ్ కోసం స్పెషల్
గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు Open Cut Pressure Sense GT Trigger అనే షోల్డర్ ట్రిగ్సర్స్ అందించారు. ప్రతి ట్రిగ్గర్‌కు నాలుగు మ్యాపింగ్ పాయింట్లు, 10 ప్రెజర్ లెవల్స్ ఉండటంతో కన్సోల్ తరహా గేమింగ్ అనుభవం లభిస్తుంది.
Infinix GT 50 Pro మొబైల్‌లో హైడ్రోఫ్లో లిక్విడ్ కూలింగ్ అర్కిటెక్చర్‌తో ప్రత్యేక కూలింగ్ సిస్టమ్ ఉంది. దీనిద్వారా వేడి త్వరగా బయటకు వెళ్లిపోతుంది. అదనంగా N1 నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ చిప్ మెరుగైన కనెక్టివిటీ అందిస్తుంది.
పవర్‌ఫుల్ బ్యాటరీ
బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 6500mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్ చార్జింగ్, 30W వైర్‌లెస్ చార్జింగ్, 10W రివర్స్ వైర్ చార్జింగ్, 5W వైర్‌లెస్ రివర్స్ చార్జింగ్ సపోర్టు ఉన్నాయి.
ధర ఎంత ఉండొచ్చంటే..!
ఇక ఈ మొబైల్ మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. Black Abyss, Red Blaze, Silver Glacier రంగుల్లో ఇది గ్లోబల్ మార్కెట్‌లోకి వచ్చింది. ఇండోనేసియాలో దీని ప్రారంభ ధరను IDR69,98,000 గా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.35వేలు ఉంటుంది. ఇక 512జీబీ వేరియంట్ ధర రూ.40వేలుగా ఉంది.
Read More:
8000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో రియల్‌మీ కొత్త మొబైల్.. రూ.15వేలలోనే ధర!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram