Payal Rajput | ప్రియుడి మూవీ ఈవెంట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న పాయల్ రాజ్‌పుత్.. ఓదారుస్తున్న నెటిజ‌న్స్

Payal Rajput | టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ తాజాగా ఓ సినిమా ఈవెంట్‌లో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన స్నేహితుడు, రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా హీరోగా నటిస్తున్న ‘ఫస్ట్ టైం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Payal Rajput | టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ తాజాగా ఓ సినిమా ఈవెంట్‌లో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన స్నేహితుడు, రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా హీరోగా నటిస్తున్న ‘ఫస్ట్ టైం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పాయల్ రాజ్‌పుత్, తన కెరీర్‌లో వచ్చిన గ్యాప్‌పై ఓపెన్‌గా స్పందించింది. తెలుగు సినిమాలకు దూరమవ్వడానికి ప్రధాన కారణం తన తండ్రి మరణమని, ఆ బాధతో డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు వెల్లడించింది. ఆ సమయంలో వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేకపోయానని, అది తన తప్పేనని ఒప్పుకుంది. ఇకపై కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తానని, మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది.

బోరున విల‌పించిన పాయ‌ల్..

ఈవెంట్‌లో జరిగిన మరో సంఘటన అందరినీ కలచివేసింది. ఎప్పుడూ చలాకీగా కనిపించే పాయల్, ఓ విలేకరి తన తండ్రి గురించి ప్రశ్నించడంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. కన్నీళ్లు ఆపుకోలేక స్టేజ్‌పైనే బోరున విలపించింది. తండ్రి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆమె మాట్లాడిన మాటలు అక్కడున్న వారిని కూడా కదిలించాయి.

నా రియల్ హీరో మా నాన్నే. వచ్చే నెలతో ఆయన చనిపోయి సంవత్సరం అవుతుంది. గత సంవత్సరం నా తండ్రి విమల్ రాజ్‌పుత్ క్యాన్సర్‌తో మరణించారు. ఆ బాధను నేను తట్టుకోలేకపోయాను” అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తన నటనను ప్రోత్సహించిన వ్యక్తి తన తండ్రేనని, ‘RX 100’ వంటి బోల్డ్ సినిమాలో నటించినా కూడా ఆయన ఎంతో గర్వంగా భావించారని చెప్పింది.

డిప్రెష‌న్‌లోకి వెళ్లా..

తండ్రి మరణం తర్వాత తాను తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు, దాని నుంచి బయటపడేందుకు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్టు పాయల్ వెల్లడించింది. అయితే ఆ బాధను పూర్తిగా జీర్ణించుకోలేకపోయినట్టు ఆమె భావోద్వేగంతో తెలిపింది. చివరకు అక్కడి పరిస్థితిని తట్టుకోలేక, స్టేజ్‌ను వదిలి వెళ్లిపోయింది.

ఇక ‘ఫస్ట్ టైం’ సినిమాకు పాయల్ స్వయంగా ప్రమోషన్స్ చేయడం విశేషం. సౌరభ్ ధింగ్రా ప్రతిభపై ఆమె నమ్మకం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని పేర్కొంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు పాయల్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె త్వరగా ఈ బాధ నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు.

Latest News